తెలంగాణలో ఆరు, ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు నవంబర్ 29న ఎన్నికలు

19 MLCs to be replaced in Legislative Council, ECI Released Schedule for MLA Quota MLC Elections in Telangana and AP, ECI releases schedule for MLA quota MLC elections, ECI releases schedule for vacant MLC Posts, Elections announced for six MLC seats under MLAs quota, Mango News, MLA Quota MLC Elections, MLA Quota MLC Elections in Telangana, MLA Quota MLC Elections in Telangana and AP, MLA Quota MLC Elections Schedule, MLC seats under MLAs quota, telangana

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఆదివారం నాడు షెడ్యూల్ విడుదల చేసింది. ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన తెలంగాణలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు, ఏపీలో మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ముందుగా తెలంగాణలో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన గుత్తా సుఖేందర్‌రెడ్డి, నేతి విద్యాసాగర్‌, బోడకుంటి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరి, ఆకుల లలిత, ఫరీదుద్దీన్‌ పదవీకాలం జూన్‌ 3,2021 తో ముగిసింది. అలాగే ఏపీ నుంచి చిన్న గోవింద రెడ్డి దేవసాని, మహ్మద్ అహ్మద్ షరీఫ్, సోము వీర్రాజుల పదవీకాలం కూడా మే 31, 2021 తో ముగిసింది.

సభ్యుల పదవీ కాలం ముగియక ముందే ఈసీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, కరోనా పరిస్థితుల దృష్ట్యా ఇరు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలును వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో తాజాగా ఈసీ ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. నవంబర్ 9వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుందని, నవంబర్ 29వ తేదీన పోలింగ్ నిర్వహించి, అదే రోజున ఓట్ల లెక్కింపు పక్రియ చేపట్టనున్నట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది.

తెలంగాణ, ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్:

  • నోటిఫికేషన్ జారీ – నవంబర్ 9
  • నామినేషన్లకు ఆఖరితేదీ – నవంబర్ 16
  • నామినేషన్ల పరిశీలన – నవంబర్ 17
  • ఉపసంహరణకు ఆఖరుతేదీ – నవంబర్ 22
  • ఎన్నిక జరిగే తేదీ – నవంబర్ 29
  • పోలింగ్ సమయం – ఉదయం 09:00 నుంచి సాయంత్రం 04:00 వరకు
  • ఓట్ల లెక్కింపు – నవంబర్ 29 (సాయంత్రం 5 గంటల నుంచి).

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − 5 =