రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల ప్రారంభంపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష

Education Minister, Education Minister Sabitha Indra Reddy, Educational Institutions In telangana, Mango News, Opening of Educational Institutions, Opening of Educational Institutions In Telangana, Sabitha Indra Reddy, Sabitha Indra Reddy On Opening of Educational Institutions, Telangana Education Minister Sabitha Indra Reddy, Telangana Educational Institutions

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలను కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రారంభించేందుకు అవసరమైన మార్గదర్శకాలను వెంటనే రూపొందించాలని విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని విద్యా సంస్థలను ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రారంభించాలన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం విద్యా శాఖ అధికారులతో మంత్రి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. విద్యా సంస్థలను ప్రారంభించేందుకు అధికారులు, ఉపాధ్యాయులు, ప్రైవేట్ యాజమాన్యాలు పూర్తి స్థాయిలో ఈ నెల 25 వ తేదీ నాటికి సన్నద్ధం కావాలని సూచించారు. 9, 10, ఇంటర్, డిగ్రీ, ఇతర వృత్తి విద్యా కోర్సుల తరగతులను ఏ విధంగా నిర్వహించాలనే విషయంలో తరగతుల వారిగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ఈ నెల 20వ తేదీ లోగా ప్రభుత్వానికి అందజేయాలని మంత్రి కోరారు. విద్యా సంస్థలు, వసతిగృహాలు, గురుకుల పాఠశాలల్లోని పరిస్థితులను పరిశీలించి అవసరమైన చర్యలను చేపట్టాలని జిల్లా కలెక్టర్లను ఇప్పటికే ఆదేశించినట్లు మంత్రి గుర్తు చేశారు.

ఈ విద్యా సంవత్సరం క్యాలెండర్‌ను విడుదల చేయాలి:

జిల్లాలోని విద్యా సంస్థల పూర్తి స్థాయి నివేదికలను జిల్లా కలెక్టర్ల ద్వారా రూపొందించాలని ఆదేశించారు. విద్యా సంస్థల్లో భోజన సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు బియ్యం, పప్పు, ఇతర ఆహార ధాన్యాలను జిల్లా కలెక్టర్లు సమకూరుస్తారని తెలిపారు. విద్యా శాఖాధికారులు ప్రత్యేకంగా అన్ని పాఠశాలలను ప్రత్యక్షంగా పరిశీలించి పాఠశాలలను ప్రారంభించేందుకు అవసరమైన చర్యలను చేపట్టాలని ఆదేశించారు. వివిధ సంక్షేమ శాఖలు నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలలు, కళాశాలలను పూర్తి స్థాయిలో సన్నద్ధం చేసేందుకు ఈ నెల 18వ తేదీన ఆయా మంత్రులు, అధికారులతో ప్రత్యేకంగా సమావేశమవనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వం రూపొందించే మార్గదర్శకాలకు అనుగుణంగా, ప్రైవేట్ విద్యా సంస్థలు నడుచుకునే విధంగా ఈ నెల 18వ తేదీన ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, వృత్తి విద్యా కోర్సుల యాజమాన్య కమిటీలతో కూడా ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించి వారిని సన్నద్ధం చేయనున్నట్లు తెలిపారు. 9,10, ఇంటర్, డిగ్రీ, వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి ఈ విద్యా సంవత్సరం క్యాలెండర్‌ను విడుదల చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రాంచంద్రన్, సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిట్టల్, ఉమర్ జలీల్, దేవసేనా తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + nine =