బీజేపీలో ఈటల రాజేందర్ చేరికకు ముహూర్తం ఖరారు

Etala Rajender, Etala Rajender Comments On TRS, Etala Rajender Join BJP, Etala Rajender Latest News, Etala Rajender Latest Updates, Etala Rajender Resigns To TRS Party, Etala Rajender to Join in BJP, Etala Rajender to Join in BJP on June 13th, Etala Rajender will Join in BJP in the Presence of JP Nadda, Etala Rajender will Join in BJP on June 14th at Delhi in the Presence of JP Nadda, Ex Minister Etala Rajender, Ex-Minister Etala Rajender Likely to Join in BJP, Mango News

మాజీ మంత్రి ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. జూన్ 14, సోమవారం నాడు ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈటల రాజేందర్ బీజేపీలో చేరి, కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఈటలతో పాటుగా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, కరీంనగర్ జెడ్పీ మాజీ ఛైర్ పర్సన్ తులా ఉమ మరియు పలువురు స్థానిక నేతలు బీజేపీలో చేరనున్నారు.

ముందుగా భూ ఆక్రమణ ఆరోపణలు రావడం, తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గం నుంచి తొలగింపుతో టీఆర్ఎస్ పార్టీతో ఈటల రాజేందర్ కు దూరం పెరిగిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో ఢిల్లీ వెళ్లిన ఆయన జేపీ నడ్డాతో భేటీ అయి పార్టీలో చేరిక అంశంపై చర్చించారు. అనంతరం హైదరాబాద్ చేరుకుని జూన్ 4న టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తునట్టు ప్రకటించారు. తాజాగా ఈటల బీజేపీలో చేరే తేదీపై కూడా స్పష్టత ఇచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here