కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఛైర్మన్‌కు లేఖ రాసిన తెలంగాణ ప్రభుత్వం

Andhra-Telangana water dispute, AP-TS Water Disputes, Krishna water dispute, Krishna Water Disputes Tribunal, Mango News, Telangana AP Water Disputes, Telangana government writes letter to KRMB Chairman, Telangana Govt Writes Letter To KRMB Chairman, Telangana Govt Writes Letter To KRMB Chairman Over Water Issue With AP, Water Dispute Between Telangana and Andhra Pradesh, Water Disputes, water disputes between Andhra and Telangana, Water Disputes Between Telugu States, Water Issue With AP

గత కొన్నిరోజులుగా కృష్ణా జలాల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ఛైర్మన్‌ కు తెలంగాణ ప్రభుత్వం మరోసారి లేఖ రాసింది. ఈ లేఖలో తెలంగాణ ఇంజనీర్ ఇన్ చీఫ్ సీ.మురళీధర్‌ పలు అంశాలను ప్రస్తావించారు. శ్రీశైలం జలాశయం నుంచి ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా అక్రమ నీటి తరలింపును ఆపివేయాలని కోరారు. బనకచర్ల రెగ్యులేటర్ కాంప్లెక్స్ వద్ద ఉన్న నిప్పులవాగు ఎస్కేప్ చానల్ ద్వారా కెసి కాలువకు నీటిని తరలించడం వెంటనే ఆపివేయించాలన్నారు.

“నీటి కేటాయింపులు లేని హెఛ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టుకు శ్రీశైలం జలాశయం నుంచి ఎత్తిపోతలను వెంటనే ఆపివేయాలి. సుంకేశుల బ్యారేజి ద్వారా కె సి కాలువకు 39.90 టీఎంసీల నీటి కేటాయింపులు ఉండాగా ప్రతీఏటా సరాసరి 54 టీఎంసీల తుంగభద్ర జలాలు తరలిస్తునారు. ఆర్డీఎస్ కు 15.90 టీఎంసీల కేటాయింపులు ఉండగా సరాసరి 5 టీఎంసీలకు మించి తరలించడం సాధ్యం కావడం లేదు. తుంగభద్ర జలాలకు అదనంగా కెసి కాలువకు కృష్ణా జలాలను శ్రీశైలం నుంచి తరలించడం అక్రమం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జలాల్లో శ్రీశైలం నుంచి 39 టీఎంసీలు మాత్రమే తరలించాలి. కానీ ఈ తరహా కేటాయింపులు లేని అక్రమ లిస్ట్ ల ద్వారా తన పరిమితికి మించి నీటిని ఎత్తి పోసుకుంటున్నది. కావున ట్రిబ్యున ద్వారా ప్రాజెక్టుల వారీ కేటాయింపులు జరిపే దాకా ఈ లిస్ట్ ల ద్వారా నీటి కేటాయింపులను కేఆర్ఎంబీ నిరోధించాలి” అని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + 4 =