గ్రేటర్ కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి, ఫలితాలపై ప్రజల్లో ఆసక్తి

GHMC Election Votes Counting Will Be Held Tomorrow, All Arrangements Done,GHMC Updates,GHMC Election Updates,GHMC Elections 2020 Updates,GHMC Elections 2020,GHMC Votes Counting,GHMC Elections Counting,GHMC Votes,#GHMCElections2020,GHMC Elections 2020 Latest News,GHMC,GHMC Elections Voting,GHMC Elections Latest Updates,GHMC Elections 2020 Latest Reports,2020 GHMC Elections,GHMC Elections 2020 Live Updates,GHMC Votes Counting Will Be Held Tomorrow,GHMC Election Votes Counting All Arrangements Done,GHMC Election Votes Counting

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పక్రియ రేపు జరగనుంది. మొత్తం 150 డివిజన్లకు సంబంధించిన ఫలితాలు రేపు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో కౌంటింగ్ కోసం కరోనా నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలు కానుండగా ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించి, అనంతరం రెగ్యులర్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు. జీహెచ్‌ఎంసీలో పరిధిలో 30 కౌంటింగ్ కేంద్రాల్లో 166 కౌంటింగ్‌ టేబుళ్లను ఏర్పాటు చేసినట్టు అధికారులు ప్రకటించారు. ఒక్కో డివిజన్‌కు 14 టేబుళ్లతో కూడిన కౌంటింగ్‌ హాల్స్ ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల పలితాలతో 1,122 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది.

మరోవైపు కేవలం పాస్ ఉన్నవారికి మాత్రమే కౌంటింగ్‌ కేంద్రంలోకి అనుమతి ఇస్తామని అధికారులు వెల్లడించారు. అలాగే కౌంటింగ్‌ కేంద్రాల్లోకి మొబైల్‌ ఫోన్లుకు అనుమతి లేదని, అన్ని కేంద్రాల్లో పరిశీలనకు వీడియోగ్రఫీ, సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక కౌంటింగ్ అనంతరం ఎన్నికల పరిశీలకుడి అనుమతి తర్వాతే ఫలితాలు వెల్లడించనున్నటు ప్రకటించారు. అనుమానిత ఓట్లపై రిటర్నింగ్ అధికారే తుది నిర్ణయం తీసుకుంటారని అన్నారు. ఎవరైనా అభ్యర్థులు రీకౌంటింగ్‌ అవసరమని భావిస్తే ఫలితాల ప్రకటనకు ముందే రిటర్నింగ్‌ అధికారికి తెలియజేయాలని సూచించారు. ఒకవేళ ఇద్దరు అభ్యర్థులకు ఓట్లు సమానంగా వస్తే లాటరీ పద్ధతిలో ఫలితాన్ని ప్రకటించనున్నట్టు పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలైన టిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం విమర్శలు ప్రతి విమర్శలతో ప్రచారం హోరెత్తించడంతో గ్రేటర్ ఫలితాలపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో ఆసక్తి నెలకుంది. ప్రధాన పార్టీలన్నీ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కాగా బల్దియా మేయర్ పీఠం దక్కించుకునేదెవరో మరి కొద్దీ గంటల్లో తేలనుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 1 =