కరోనాతో బీజేపీ రాజ్యసభ ఎంపీ అభయ్ భరద్వాజ్ కన్నుమూత

BJP Rajya Sabha MP Abhay Bhardwaj Succumbs To Covid-19,BJP,BJP Rajya Sabha MP Abhay Bhardwaj,MP Abhay Bhardwaj Succumbs To Covid-19,Abhay Bhardwaj,MP Abhay Bhardwaj,Rajya Sabha MP Abhay Bhardwaj,Mango News,Mango News Telugu,Gujarat BJP MP Abhay Bhardwaj Succumbs To Covid-19,BJP MP Abhay Bhardwaj Passed Away,BJP MP Abhay Bhardwaj Is No More,BJP Rajya Sabha Member From Gujarat Abhay Bhardwaj Passed Away,BJP Rajya Sabha MP Abhay Bhardwaj Succumbs To Coronavirus,Covid-19,Abhay Bhardwaj News

గుజరాత్ రాష్ట్రానికి చెందిన బీజేపీ రాజ్యసభ ఎంపీ అభయ్ భరద్వాజ్ కన్నుమూశారు. ఆయన వయసు 66 సంవత్సరాలు. ఎంపీ అభయ్ భరద్వాజ్ కి గత ఆగస్టు 31 న కరోనా పాజిటివ్ గా తేలడంతో ముందుగా రాజ్‌కోట్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆయన్ను ఇటీవలే ఎయిర్ అంబులెన్స్‌లో చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మంగళవారం నాడు ఆయన తుదిశ్వాస విడిచినట్టుగా వైద్యులు వెల్లడించారు.

ఈ ఏడాది జూలై లోనే రాజ్యసభ ఎంపీగా అభయ్ భరద్వాజ్ ఎంపికయ్యారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన భరద్వాజ్ రాజ్ కోట్ ఆర్ఎస్ఎస్ లో కీలక సభ్యుడిగా ఉన్నారు. అభయ్ భరద్వాజ్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, గుజరాత్ సీఎం విజయ్ రూపాని సహా పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. కొద్దిరోజుల్లోనే గుజరాత్ కు చెందిన ఇద్దరు రాజ్యసభ ఎంపీలు కరోనా వలన మరణించారు. గుజరాత్ కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ అహ్మద్ పటేల్ కూడా కరోనాతో ఇటీవల మరణించిన విషయం తెలిసిందే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 4 =