కంటి వెలుగు:ఇప్పటికి 80,67,243 మందికి కంటి పరీక్షలు, 13,70,296 మందికి రీడింగ్ గ్లాసెస్ పంపిణీ

Kanti Velugu Program 2nd Phase in Telangana: 8067243 People Have Been Screened till March 17th,Kanti Velugu Program 2nd Phase,Telangana Kanti Velugu Program,Kanti Velugu 8067243 People Have Been Screened till March 17th,Kanti Velugu 2nd Phase in Telangana,Mango News,Mango News Telugu,Telangana Government Begins 2nd Phase,Kanti Velugu,Second phase of Kanti Velugu News Today,Kanti Velugu Program Latest Updates,Telangana Kanti Velugu Program Live News,Kanti Velugu Screening News

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘కంటి వెలుగు’ రెండో విడత కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కంటి వెలుగు వైద్య శిబిరాలలో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు ఇప్పటి వరకు (మార్చి 17, శుక్రవారం) 80 లక్షల 67 వేల 243 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. అలాగే కంటి వెలుగు కార్యక్రమంలో మార్చి 17 నాటికీ 13,70,296 మందికి కంటి అద్దాలు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ మేరకు కంటి వెలుగు కార్యక్రమ తాజా వివరాలను ప్రభుత్వం ఒక ప్రకటన ద్వారా విడుదల చేసింది. జనవరి 18వ తేదీన ఖ‌మ్మం జిల్లాలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కంటి వెలుగు రెండో విడతను ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ఈ కార్యక్రమం మొత్తం 100 ప‌ని దినాల్లో, జులై 15వ తేదీ వరకు నిర్వహించనున్నారు.

కంటి వెలుగు (2023, మార్చి 17న):

  • కంటి ప‌రీక్ష‌లు: 1,99,986 మంది
  • రీడింగ్ గ్లాసెస్ పంపిణీ: 22,631
  • ప్రిస్కిప్ష‌న్ గ్లాసెస్ కోసం రెఫ‌ర్‌: 18,333
  • కంటి స‌మ‌స్య‌లు లేనివారు: 1,59,017 మంది

కంటివెలుగులో ఇప్ప‌టివ‌ర‌కు (2023, మార్చి 17) మొత్తం వివరాలు:

  • మొత్తం కంటిప‌రీక్ష‌లు: 80,67,243 మంది
  • మొత్తం రీడింగ్ గ్లాసెస్ పంపిణీ: 13,70,296
  • మొత్తం ప్రిస్కిప్ష‌న్ గ్లాసెస్ కోసం రెఫ‌ర్‌: 9,96,915
  • కంటి స‌మ‌స్య‌లు లేనివారు: 56,99,862 మంది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − fourteen =