కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కలిసిన మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్‌

Tollywood Actors Megastar Chiranjeevi and Ram Charan Meets Union Home Minister Amit Shah at Delhi,Tollywood Actors Megastar Chiranjeevi,Tollywood Actor Ram Charan Meets Union Home Minister,Union Home Minister Amit Shah,Megastar Chiranjeevi Meets Amit Shah,Megastar Chiranjeevi and Ram Charan Meets Amit Shah,Mango News,Mango News Telugu,Tollywood Actors at Delhi,Ram Charan calls on Amit Shah in Delhi,Chiru & Charan with Union Home Minister,Amit Shah Met RRR Fame Actor Ram Charan

టాలీవుడ్ ప్రముఖ నటులు మెగాస్టార్ చిరంజీవి మరియు ఆయన కుమారుడు, మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ న్యూఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు వరించిన సందర్భాన్ని పురస్కరించుకుని శుక్రవారం రాత్రి వీరిరువురూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఈ క్రమంలో రామ్‌చరణ్‌ను అమిత్‌ షా శాలువాతో సత్కరించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించడం మరియు నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు లభించడంపై హర్షం వ్యక్తం చేసిన అమిత్‌ షా, దీనిలో భాగమైన రామ్‌చరణ్‌ను అభినందించారు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు అగ్ర నటులను కలుసుకోవడం చాలా సంతోషాన్నిచ్చిందని ట్విట్టర్ వేదికగా అమిత్‌ షా పేర్కొన్నారు. కాగా ఈ సందర్భంగా రామ్‌చరణ్‌కు అభినందనలతో పాటు ఆశీస్సులు అందించిన అమిత్‌ షాకు కృతజ్ఞతలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here