మునిసిపల్ ఎన్నికల పై కెటిఆర్ కసరత్తు

Election Notification for municipal polls on July 14, KTR About municipal polls, KTR asks leaders to focus on urban areas, KTR Instructions To Party Leaders Over Municipal Elections, KTR Spoke To Party Leaders Over Municipal Elections, Mango News, Municipal Elections Latest updates, Telangana Latest News, Telangana Political News

ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగి రెడ్డి, జూలై 14 తర్వాత ఎప్పుడైనా రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికలు జరుగుతాయని, ఈసీ అప్పటి కల్లా సన్నద్ధం అవుతుందని ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో అద్భుతమైన విజయం సాధించి, 32 జిల్లా పరిషత్ చైర్మన్, మరియు వైస్ చైర్మన్ పదవులు పదవులు దక్కిచుకున్న తెరాస పార్టీ, ఇప్పుడు మునిసిపల్ ఎలక్షన్స్ పై దృష్టి సారించడానికి సిద్ధం అవుతుంది. తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, పార్టీ ప్రముఖులతో కలిసి వ్యూహరచనలు చేస్తున్నారు. పురపాలక ఎన్నికలలో అత్యధిక స్థానాలే లక్ష్యంగా పెట్టుకొని, పార్టీ అధ్యక్షుడు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ సలహాలు, సూచనలు మేరకు కార్యాచరణ రూపకల్పనకు సిద్ధమయ్యారు.

పురపాలక ఎన్నికలుకు నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి తెరాస పార్టీ ఎన్నికల ప్రచారం చేపట్టాలని నిర్ణయించుకున్నారు, ఎన్నికలు జరిగే అన్ని నగర పాలక సంస్థలతో పాటు, ప్రధానమైన మునిసిపాలిటీలలో కెటిఆర్ ప్రచారం నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచార బాధ్యతలు స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, మరియు ఎమ్మెల్సీ లకు కూడ అప్పగించనున్నారు. ప్రతి పురపాలక సంఘానికి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకొని, వార్డులు, సామాజిక మాధ్యమాలో వినూత్న రీతిలో ప్రచారం చేపట్టనున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 15 న వెలువడుతుందని భావిస్తున్నారు.

త్వరలో జరిగే తెరాస రాష్ట్ర స్థాయి సమావేశంలో కెసిఆర్ ముఖ్యనాయకులకు, ఇతర పార్టీ సభ్యులకు, జరగబోయే పురపాలక ఎన్నికలకు సంబంధించి దిశానిర్దేశం చేయనున్నారు. అన్ని చోట్ల పోటీ చేసే అభ్యర్థులను పార్టీ అధినాయకత్వమే నిర్ణయించనుంది. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, మరియు ఎమ్మెల్సీ లతో ఒక కమిటీ వేసి, ఆశావహుల పేర్లు సేకరించి, అర్హులైన వారి పేర్లను పార్టీ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 11 =