ఆలోచనలో నిజాయితీ, ఆచరణలో చిత్తశుద్ధి ఉంటే పరిష్కారం కాని సమస్యంటూ ఉండదు – సీఎం కేసీఆర్

Maharashtra Shetkari Sanghatana Founder Sharad Joshi and Other Union Leaders Joins in BRS Party in Presence of CM KCR Today,Maharashtra Shetkari Sanghatana Founder Sharad Joshi,Sharad Joshi and Other Union Leaders Joins in BRS,Leaders Joins in BRS Party in Presence of CM KCR Today,Mango News,Mango News Telugu,Sharath Joshi Praneeth To Join In BRS Party,CM KCR To Reached Telangana Bhavan,CM KCR News And Live Updates,BRS Party,Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Hyderabad News,Telangana News,Telangana CM KCR

ఆలోచనలో నిజాయితీ, ఆచరణలో చిత్తశుద్ధి ఉంటే పరిష్కారం కాని సమస్యంటూ ఉండదని పేర్కొన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. శనివారం మ‌హారాష్ట్ర షెట్కారీ సంఘ‌ట‌న్ రైతు సంఘం అధ్యక్షుడు శ‌ర‌ద్ జోషి ప్ర‌ణీత్ సహా పలువురు రైతు నేత‌లు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సంద‌ర్భంగా వారికి సీఎం కేసీఆర్ గులాబీ కండువాలు క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘బీఆర్ఎస్‌లో చేరిన మ‌రాఠా రైతు సంఘం నేత‌ల‌కు సాద‌ర స్వాగ‌తం. త‌లచుకుంటే సాధ్యం కానిదంటూ ఏమీ ఉండ‌దు. చిత్త‌శుద్ధితో ప‌ని చేస్తే గెలిచి తీరుతాం. నా 50 ఏళ్ల రాజ‌కీయ అనుభ‌వంలో ఎన్నో అటుపోట్లు ఎదుర్కొన్నా, అయితే ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు. తెలంగాణ‌లో ఏం చేశామో మీరంతా ఒక‌సారి చూడండి. కాళేశ్వ‌రం ప్రాజెక్టును కూడా సంద‌ర్శించండి’ అని రైతు నేత‌ల‌కు సూచించారు.

ఇంకా అయన మాట్లాడుతూ.. ’13 నెల‌ల పాటు దేశ రాజ‌ధానిలో రైతులు పోరాడారు. రైతుల పోరాటం న్యాయ‌బ‌ద్ధ‌మైన‌ది. న‌ల్ల చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా ఉద్య‌మించిన రైతుల‌ను ఎన్నో రకాలుగా అవమానించారు. వారిని ఉగ్ర‌వాదుల‌తో పోల్చారు. ఖ‌లీస్తానీల‌ని, వేర్పాటువాదుల‌ని రకరకాలుగా వ్యాఖ్యానించారు. అయితే ఆత్మస్థైర్యంతో రైతులు చేసిన పోరాటంతో ప్రధాని మోదీ దిగివ‌చ్చి క్ష‌మాప‌ణ చెప్పారు. అయితే ఈ క్రమంలో 750 మంది రైతులు చ‌నిపోతే ఆయన క‌నీసం స్పందించ‌లేదు. మ‌న దేశంలో దేనికి కొద‌వ లేదు. అయిన‌ప్ప‌టికీ రైతులు, ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటే దానికి కారణం పాలకులే. దేశంలో 94 ల‌క్ష‌ల ఎక‌రాల్లో వ‌రి పండుతుంది. రైతుల గోస చూసి నాకు క‌న్నీళ్లు వ‌చ్చేవి. అయితే తెలంగాణ ఏర్పడ్డాక రైతుల ఆత్మహత్యలు ఆగిపోయాయి. అందులో 56 ల‌క్ష‌ల ఎక‌రాల వ‌రి కేవలం తెలంగాణ‌లోనే పండుతుంది’ అని సీఎం కేసీఆర్ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here