ఏపీలో పదో తరగతి పరీక్షలు, ఒంటిపూట బడులపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన

Minister Botsa Satyanarayana Key Announcement on 10th Class Exams and Half day Schools in AP,Minister Botsa Satyanarayana Key Announcement,Key Announcement on 10th Class Exams,Minister Botsa on Half day Schools in AP,Minister Botsa on 10th Class Exams,Mango News,Mango News Telugu,Minister Botsa Satyanarayana,Minister Botsa Satyanarayana Key Instructions,10th Class Exams,Botsa Satyanarayana,10th Class Exams 2023 AP,AP 10th Hall Tickets 2023,Andhra Pradesh Schools To Function Half Day,Minister Botsa Satyanarayana Latest News,Minister Botsa Satyanarayana Latest Updates

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు, ఒంటిపూట బడులపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు. శనివారం మీడియా సమావేశం నిర్వహించిన ఆయన దీనికి సంబంధించిన వివరాలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నామని, దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా 3,449 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ పరీక్షలకు మొత్తం 6 లక్షల 9 వేల 70 మంది విద్యార్థులు హాజరవనున్నారని, వీరిలో.. వీరిలో 3,11,329 బాలురు ఉండగా.. 2,97,741 మంది బాలికలు ఉన్నారని చెప్పారు. ఈ సారి కూడా పదో తరగతి పరీక్షకు ఆరు పేపర్లే ఉంటాయని, ఉదయం 9.30 దాటిన తర్వాత ఒక్క నిమిషం ఆలస్యం అయినా అనుమతించబోమని విద్యార్థులకు సూచించారు.

ఎగ్జామ్స్ సందర్భంగా విద్యార్ధులకు పరీక్షా కేంద్రానికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందిస్తున్నామని తెలిపిన మంత్రి, ప్రభుత్వ ఉపాధ్యాయులు మాత్రమే ఇన్విజిలేటర్లుగా ఉంటారని, ఇక పరీక్షా కేంద్రాల్లోకి సెల్ ఫోన్‌లకు అనుమతి లేదని స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణకు 800 స్క్వాడ్స్ ఏర్పాటు చేశామని, ఇన్విజిలేటర్లు కూడా ఫోన్స్ తీసుకురాకూడదని ఆయన తెలిపారు. మరోవైపు పదో తరగతి పరీక్షలు జరిగే పాఠశాలల్లో రెండుపూటలా సెలవులు ఉంటాయని వివరించారు. అలాగే పరీక్ష సమయంలో బయటి వారు ఎవరూ పరీక్షా కేంద్ర ప్రాంగణంలో అడుగు పెట్టడం నిషేధం అని, నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయని మంత్రి బొత్స సత్యనారాయణ హెచ్చరించారు.

ఇక మరోవైపు ఏప్రిల్ 3 నుంచి ఏపీలో ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నట్లు మంత్రి బొత్స తెలియజేశారు. హాఫ్ డే స్కూల్స్‌ సందర్భంగా ఉదయం 7.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పాఠశాలలు కొనసాగుతాయని, విద్యార్థులకు స్కూల్ ముగిసిన తర్వాత మధ్యాహ్న భోజనం పెట్టి ఇంటికి పంపిస్తామని చెప్పారు. కాగా సమ్మర్ నేపథ్యంలో పాఠశాలల్లో పిల్లలకు ఎండ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాాలని, అన్ని క్లాస్ రూమ్స్‌లో ఫ్యానులు తిరిగేలా, మంచి నీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని మంత్రి పేర్కొన్నారు. ఇక ఏప్రిల్ 30 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని, అయితే జూన్ 12 నుంచి స్కూల్స్ రీ ఓపెన్ అవుతాయని, దాదాపు 45 రోజులు సమ్మర్ హాలిడేస్ ఉంటాయని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here