వచ్చే నెల నుంచి తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ న్యూట్రిషన్‌ కిట్ల పంపిణీ – మంత్రి హరీశ్‌ రావు

Minister Harish Rao Announces Will Distributes KCR Nutrition Kits Across Telangana From Next Month,Minister Harish Rao Announcement,Harish Rao Distributes Nutrition Kits,KCR Nutrition Kits Across Telangana,KCR Nutrition Kits From Next Month,Mango News,Mango News Telugu,Harish Rao Launches KCR Nutrition Kit,State Govt To Launch KCR Nutrition Kits,KCR Nutrition Kit To Be Launched,Telangana Ministers Launches KCR Kit,Telangana Latest News And Updates,Telangana News

వచ్చే నెల నుంచి తెలంగాణ వ్యాప్తంగా న్యూట్రిషన్‌ కిట్లు అందించనున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. సోమవారం ఆయన సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కొత్తగా ఏర్పాటు చేసిన ఈ-లైబ్రరీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌ రావు మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడక ముందు రాష్ట్రంలో కేవలం మూడు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ 8 ఏళ్ళల్లో 12 మెడికల్ కాలేజీలు ప్రారంభించుకున్నామని తెలిపారు. గతేడాది 2022 సంవత్సరంలోనే 8 కాలేజీలను ఏర్పాటు చేశామని, ఈ క్రమంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీని కేవలం 7 నెలల్లోనే పూర్తి చేశామని వివరించారు.

ఇక రాష్ట్రంలో ప్రస్తుతం ప్రతి లక్షమందికి 19 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్న మంత్రి హరీశ్‌ రావు.. రూ.16.5 కోట్లతో రాష్ట్రంలో మూడు ఐవీఎఫ్‌ ఫెర్టిలిటీ సెంటర్లను కూడా ప్రారంభించుకున్నామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్ వ్యవహారంపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. అలాగే ప్రతి మెడికల్ కాలేజీలో లైబ్రరీ సహా పలు ఇతర సదుపాయాలు కల్పిస్తున్నామని, కేంద్రం నిర్వహణలో పనిచేసే ఎయిమ్స్‌ ఆస్పత్రుల్లో కంటే తెలంగాణలోని మెడికల్‌ కాలేజీల్లోనే ఎక్కువ సౌకర్యాలు కల్పించామని హరీశ్ రావు పేర్కొన్నారు. ఇక వచ్చే నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ న్యూట్రిషన్‌ కిట్లను పంపిణీ చేయనున్నామని, గర్భిణీ స్త్రీలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. కాగా అంతకుముందు సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో జీవో 58, 59 ప్రకారం లబ్ధిదారులకు మంత్రి హరీశ్‌ రావు భూమి హక్కు పత్రాలను పంపిణీ చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + fifteen =