రాష్ట్రంలో బూస్టర్ డోస్ పంపిణీకి వ్యాక్సిన్స్ సరఫరా చేయండి, కేంద్రాన్నికోరిన మంత్రి హరీశ్ రావు

Minister Harish Rao Appeal Centre to Supply Covid Vaccines, Minister Harish Rao, Covid Vaccines, Booster Dose Distribution in Telangana State, Mango News, Mango News Telugu, Telangana Health Minister T Harish Rao, Telangana urges Union Health Ministry, Harish Rao Requests Central Govt, Booster Dose Vaccines, Central Govt To Supply Booster Dose, Minister Harish Rao Latest News

కోవిడ్-19 పరిస్థితులపై రాష్ట్రాల సన్నద్ధతపై శుక్రవారం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా నిర్వహించిన వీడియో సమీక్షలో తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, రాష్ట్ర ఉన్నతాధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు కేంద్రానికి పలు విజ్ఞప్తులు చేశారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి కోవిడ్ బూస్టర్ డోసులు సరఫరా చేయాలని కోరారు. ప్రస్తుతం కోవాక్జిన్ 8 లక్షలు, కోవిషీల్డ్ 80 వేలు ఉండగా కోర్బివాక్స్ డోసులు సున్నా ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో బూస్టర్ వేగవంతం చేసేందుకు అవసరమైన వ్యాక్సిన్ లను రాష్ట్రానికి సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే బూస్టర్ డోసు విషయంలో జాతీయ సగటు 23 శాతం ఉంటే తెలంగాణ సగటు 48 శాతంగా మెరుగైన స్థితిలో ఉందన్నారు.

సీఎం కేసీఆర్ నిత్య పర్యవేక్షణ, అప్రమత్తత చేయడం, ప్రజల్లో అవగాహన పెంచడం వలనే ఇది సాధ్యమైందన్నారు. ప్రపంచ దేశాల్లో ఓమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్.7 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ లక్షణాలు, వ్యాప్తి తీరు, ప్రభావం, చికిత్స వంటి అంశాల గురించి రాష్ట్రాలకు తెలియజేయాలని, ఈ అవగాహనతో మరింత అప్రమత్తంగా ఉండడం సాధ్యం అవుతుందని మంత్రి హరీశ్ రావు అన్నారు. గత అనుభవాల దృష్ట్యా ఆక్సిజన్ సరఫరాలో ఎలాంటి కొరత లేకుండా ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. అందులో భాగంగా ఆక్సిజన్ ప్లాంట్స్ లను సమీప ఆసుపత్రులతో అనుసంధానం చేసేలా మ్యాపింగ్ చేసే విధానాన్ని తీసుకురావాలన్నారు. యాన్యువల్ మెంటెనెన్స్ కాంట్రాక్ట్ లేకపోవడం వల్ల కేంద్రం నుంచి వచ్చిన వెంటిలేటర్లు, పీఎస్ఏ ప్లాంట్స్ మరమ్మతులు జరగటం లేదని, వాటిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

ముందస్తు చర్యలో భాగంగా రాష్ట్రాల్లో అవసరమైన వైద్య సదుపాయాలు మెరుగుపరిచేందుకు ఈసీఆర్పీ-3 (ఎమర్జెన్సీ కోవిడ్ రెస్పాన్స్ ప్యాకేజ్-3) రూపొందించే విషయమై కేంద్రం ఆలోచించాలన్నారు. కేంద్రమంత్రి నిర్వహించిన కోవిడ్స-19 సమీక్షలో తెలంగాణ నుంచి మంత్రి హరీశ్ రావుతో పాటుగా ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేతా మహంతి, టిఎస్ఎంఎస్ఐడిసి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, డీఎంఈ రమేష్ రెడ్డి, డీహెచ్ జీ.శ్రీనివాస్ రావు, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, సీఎం ఓఎస్డీ గంగాధర్ పాల్గొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here