రాష్ట్రంలో సూపర్ స్ప్రేడర్లకు టీకాలు వేయడంపై మంత్రి హరీశ్ రావు, సీఎస్ సమావేశం

Covid-19 Vaccination, Covid-19 Vaccination Centres, CS Somesh Kumar, CS Somesh Kumar held Meeting on Vaccination for Super Spreaders, Harish Rao, Mango News, Mass vaccinations camps are super spreaders of Covid, Minister Harish Rao, Overcrowding at COVID vaccination centres, Telangana CS Somesh Kumar, Vaccination, Vaccination for Super Spreaders

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావుతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం నాడు సూపర్ స్ప్రేడర్లు అందరికీ టీకాలు వేసే అంశంపై సమావేశం నిర్వహించి, చర్చించారు. ఈ సందర్భంగా ఎల్పీజి డెలివరీ సిబ్బంది, చౌకధరల షాపు డీలర్లు, పెట్రోల్ పంప్ కార్మికులు, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, రైతు బజార్లలోని విక్రేతలు, పండ్లు, కూరగాయలు మరియు పూల మార్కెట్లు, కిరాణా షాపులు, మద్యం దుకాణాలు, మాంసాహార మార్కెట్లలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వ్యాక్సినేషన్ చేపట్టాలని నిర్ణయించారు.

అలాగే సూపర్ స్ప్రెడర్ల గుర్తింపు మరియు ఇతర లాజిస్టిక్ ఏర్పాట్లకు సంబంధించిన అంశాలు ఈ సమావేశంలో చర్చించినట్టు తెలిపారు. వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, జీహెఛ్ఎంసీ కమీషనర్ లోకేశ్ కుమార్, మున్సిపల్ పరిపాలన కమీషనర్ మరియు డైరెక్టర్ యన్.సత్యనారాయణ, రవాణా శాఖ కమిషనర్ యం.ఆర్.యం.రావు, ప్రజా ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ రావు, తదితర అధికారులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 4 =