యాదగిరిగుట్టలో రూ.45 కోట్లతో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి హరీశ్‌ రావు

Minister Harish Rao Laid Foundation Stone For 100 Beds Hospital Worth of Rs 45 Cr in Yadagirigutta,Yadagirigutta Temple 2023,Yadagirigutta Development,Yadagirigutta Development Authority,Yadagirigutta Development Master Plan,Yadagirigutta Development News,Yadagirigutta Gundam,Yadagirigutta Real Estate Boom,Yadagirigutta Temple Development,Yadagirigutta Temple Development Authority,Yadagirigutta Temples,Yadagirigutta Timings,Ytda Master Plan 2021 Pdf Download,Ytda Master Plan 2031,Ytda Master Plan Map,Ytda Master Plan Pdf Download,Ytda Official Website

తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావు గురువారం యాదగిరిగుట్టలో రూ.45 కోట్ల వ్యయంతో చేపట్టిన 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేపు సీఎం కేసీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశామని పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటికే పలుచోట్ల 100 పడకల ఆసుపత్రులు ఏర్పాటు చేశామని, ఈ క్రమంలోనే యాదాద్రి స్వామివారిని దర్శించుకునేందుకు గుట్టకు వచ్చే భక్తులకు సేవలందించేందుకు నేడు ఈ నూతన ఆసుపత్రి నిర్మిస్తున్నామని మంత్రి హరీశ్‌ రావు తెలిపారు. ఇక త్వరలో రాష్ట్రంలో మరో తొమ్మిది కొత్త మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేయనున్నామని, దీనిలో భాగంగా యాదాద్రి జిల్లాలో కూడా మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ద వహించి యాదాద్రి ఆలయ నిర్మాణం చరిత్రలో నిలిచిపోయేలా చేశారని, భక్తులకు సకల వసతులతో కూడిన నిర్మాణాలు కూడా చేపడుతున్నారని వెల్లడించారు. ఇక కేసీఆర్ న్యూట్రిషన్‌ కిట్‌ను రాష్ట్రంలోని పత్రి గర్భిణికి రెండు దఫాలుగా అందిస్తున్నామని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్యను గణనీయంగా పెంచామని మంత్రి హరీశ్ రావు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − five =