తెలంగాణకు రూ.24,000 కోట్ల భారీ పెట్టుబడి, దేశంలోనే తొలి డిస్‌ప్లే ఫ్యాబ్ పరిశ్రమ

Rajesh Exports to Set up India's First Display Fab Facility in Telangana with Rs 24000 Cr Investment, Rajesh Exports to Set up India's First Display Fab Facility in Telangana, India's First Display Fab Facility in Telangana with Rs 24000 Cr Investment, Display Fab Facility in Telangana, Rajesh Exports, India's First Display Fab Facility, Telangana Govt Signs MoU With Elest To Establish India’s First Display Fab Centre, Telangana Govt Signs MoU With Elest, Establish India’s First Display Fab Centre, India’s First Display Fab Centre, Telangana Rashtra Samithi Government signed a Memorandum of Understanding with Karnataka based Elest company, TRS Government signed a MoU with Karnataka based Elest company, Memorandum of Understanding, MoU, TRS Government, Telangana Rashtra Samithi Government, Karnataka based Elest company, Elest company News, Elest company Latest News, Elest company Latest Updates, Elest company Live Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ రాష్ట్రంలో భారీ పెట్టుబ‌డులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకోస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశ చరిత్రలోనే తొలిసారిగా డిస్‌ప్లే ఫ్యాబ్ రంగంలో తెలంగాణకు మరో భారీ పెట్టుబడి వచ్చి చేరింది. తెలంగాణ రాష్ట్రంలో డిస్‌ప్లే ఫ్యాబ్ కోసం ఎలెస్ట్ కంపెనీ సంస్థ రూ.24,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ఎలెస్ట్ కంపెనీ ప్రపంచ ఫార్చ్యూన్-500 కంపెనీల్లో ఒకటైన రాజేష్ ఎక్స్‌పోర్ట్స్‌ ద్వారా ఏర్పాటు చేయబడింది. ఎలెస్ట్ కంపెనీని అమోలెడ్ డిస్‌ప్లే, లిథియం అయాన్ సెల్స్, బ్యాటరీలు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ముందుగా ఆదివారం బెంగళూరులో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తో రాజేశ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ రాజేశ్‌ మెహతా, సంస్థ ప్రతినిధులు సమావేశమయ్యారు. అనంతరం మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆ సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఒప్పందంపై రాజేశ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ రాజేశ్‌ మెహతా, తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ సంతకాలు చేశారు.

అనంతరం మంత్రి కేటీఆర్ ట్వీట్ చేస్తూ ఇది తెలంగాణకు చారిత్రాత్మక రోజని పేర్కొన్నారు. “రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ (ఎలెస్ట్), ఫార్చూన్-500 కంపెనీ భారతదేశపు మొట్టమొదటి డిస్‌ప్లే ఫ్యాబ్ ని తెలంగాణలో స్థాపించనుంది. ఈ సంస్థ రూ.24,000 కోట్ల పెట్టుబడి పెట్టనుండగా, ఇది అత్యంత అధునాతన అమోలెడ్ డిస్‌ప్లేలను తయారుచేయనుంది. ఈ పెట్టుబడి భారతదేశంలోని హైటెక్ తయారీ రంగంలో అతిపెద్ద పెట్టుబడుల్లో ఒకటిగా నిలిచింది. అధునాతన హైటెక్ తయారీలో తెలంగాణ భారతదేశాన్ని ప్రపంచ పటంలో ఉంచింది. ఇప్పటివరకు జపాన్, కొరియా, తైవాన్‌లలో మాత్రమే సాధ్యమైనది ఇప్పుడు తెలంగాణలో జరగనుంది. ప్రపంచ స్థాయి టీవీ, స్మార్ట్‌ఫోన్ అండ్ టాబ్లెట్ తయారీదారులకు సరఫరా చేయడం, భాగస్వాములు మరియు అనుబంధ రంగాలకు భారీ స్థాయి ఎకో సిస్టం రూపొందించడం జరుగుతుంది” అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ పెట్టుబడి ప్రకటనతో సెమీకండక్టర్ మరియు డిస్‌ప్లే ఫ్యాబ్ రంగంలో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. ఇది దేశంలోని ఎలక్ట్రానిక్స్ రంగంలో అతిపెద్ద పెట్టుబడులలో ఒకటి మరియు తెలంగాణ రాష్ట్రంలో పరిమాణపరంగా అతిపెద్ద పెట్టుబడిగా నిలిచింది, అలాగే రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను కూడా ఎలెస్ట్ సంస్థ ఏర్పాటు చేయనుంది.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 − two =