ప్రజాక్షేత్రంలో గెలిచిన సీఎం జగన్‌ను విమర్శించే అర్హత నారా లోకేష్‌కు లేదు – ఏపీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డి

AP SAAP Chairman Byreddy Siddharth Reddy Slams TDP National General Secretary Nara Lokesh,AP SAAP Chairman,Byreddy Siddharth Reddy,TDP National General Secretary,Nara Lokesh,Mango News,Mango News Telugu,Tdp Chief Chandrababu Naidu,AP CM YS Jagan Mohan Reddy,YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates

టీడీపీ యువనేత, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై ఏపీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సహా నారా లోకేష్‌పై పలు విమర్శలు చేశారు. ఈ సందర్భంగా బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాక్షేత్రంలో అత్యద్భుతమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డిని విమర్శించే నైతిక అర్హత నారా లోకేష్‌కు లేదని పేర్కొన్నారు. వారు అభివృద్ధి చేశారని ప్రచారం చేసుకుంటున్న రాజధాని అమరావతి ప్రాంతంలోని మంగళగిరి స్థానంలోనే లోకేష్ ఓడిపోయారని, ఒక్క స్థానంలో కూడా గెలవలేని వ్యక్తి రేపు పార్టీని అధికారంలోకి తెస్తాడని టీడీపీ నేతలు అసలు పెట్టుకుంటున్నారని బైరెడ్డి ఎద్దేవా చేశారు.

లోకేష్ ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్ అని, వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 2, 3 సీట్లు కూడా రావని సిద్ధార్ధ్ రెడ్డి వ్యాఖ్యానించారు. లోకేష్ పాదయాత్రను ప్రజలు పట్టించుకోవడం లేదని, టీడీపీ కార్యకర్తలు తప్ప సామాన్య ప్రజలెవ్వరూ ఆయన యాత్రలో పాల్గొనడం లేదని, మంత్రి రోజాను మహిళ అని కూడా చూడకుండా విమర్శించడం దారుణమని అన్నారు. ఇక అవినీతిపై లోకేష్ విమర్శలు చేయడం హాస్యాస్పదమని, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్న ఆయన సిమెన్స్ కంపెనీని అడ్డం పెట్టుకుని దాదాపు రూ.250 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఏపీలో ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉండి రాజకీయం చేయమని టీడీపీ నేతలు, కార్యకర్తలే చంద్రబాబుకు సలహా ఇస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ గెలుపును చంద్రబాబు అడ్డుకోలేరని బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డి పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + six =