లూయిస్ బ్రెయిలీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి కొప్పుల ఈశ్వర్

Minister Koppula Eshwar Unveils Louis Braille Bronze Statue at Hyderabad,Minister Koppula Eshwar,Unveils Braille Bronze Statue,Louis Braille Bronze Statue,Louis Braille Bronze Statue at Hyderabad,Mango News,Mango News,Louis Braille Story,Louis Braille - Wikipedia,Louis Braille Death,Louis Braille For Kids,Louis Braille Age,Louis Braille Pronunciation,Louis Braille Invention,Louis Braille Day,Louis Braille Coin 1809 Price In India,Rue Louis Braille

అంధత్వాన్ని జయించి, అంధులందరికీ అక్షర జ్ఞానాన్ని ప్రసాదించి వారి జీవితాలలో వెలుగును నింపిన మహనీయుడు, బ్రెయిలీ లిపి సృష్టి కర్త అయిన లూయిస్ బ్రెయిలీ 214వ జన్మదిన వేడుకలను జనవరి 4, బుధవారం మలకపేట్ లోని లూయిస్ బ్రెయిలీ పార్క్, నందు వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన షెడ్యూల్ కులాల అభివృద్ధి, మైనారిటీ, వికలాంగుల మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, మొదటగా రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన అంధ సోదరి సోదరులకు లూయిస్ బ్రెయిలీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బ్రెయిలీ లిపి నేర్చుకొని నేడు ఎంతో మంది అంధులు అన్ని రంగాల్లో విజయాలను సాధిస్తున్నారంటే అందుకు కారణం లూయిస్ బ్రెయిలీ అని కొనియాడారు.

దివ్యాంగుల కొరకు ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రభుత్వంలో అమలువుతున్నాయని, మరి దివ్యాంగుల సంక్షేమానికి ప్రతి ఏడాది బడ్జెట్ ను పెంచుతూ మరియు వికలాంగుల సాధికారతపై ప్రత్యేక దృష్టి సారించుటకు, వికలాంగుల మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖను మహిళ అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ నుండి వేరు చేస్తూ ప్రభుత్వం ఇటివలే ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. ఈ సంవత్సరం కుడా రూ.12.00 కోట్లతో వికలాంగులకు సహాయ ఉపకరణాలు పంపిణీ కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకోన్నదని గుర్తు చేశారు. అలాగే సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా దివ్యాంగుల కొరకు సహాయ ఉపకరణాలు అందించటానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ సందర్భంగా లూయిస్ బ్రెయిలీ పార్క్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన 9 అడుగుల లూయిస్ బ్రెయిలీ కాంస్య విగ్రహాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర హోం, జైళ్లు, అగ్నిమాపక సేవల మంత్రి మహ్మద్ మహమూద్ అలీ, స్థానిక ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా, వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ డా.వాసుదేవ రెడ్డి, స్థానిక మార్కెట్ యార్డ్ చైర్మన్ అనిత నాయక్, వికలాంగుల మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ సంచాలకులు బి.శైలజ, వికలాంగ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × one =