కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ‘అగ్నివీర్‌’ ప్రక్రియ రద్దు చేస్తాం – భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ

Bharat Jodo Yatra Rahul Gandhi Announces If We Come To Power Will Cancel The Agniveer Policy,Bharat Jodo Yatra,Bharat Jodo Yatra Rahul Gandhi,Agniveer Policy,Mango News,Mango News Telugu,Bharat Jodo Yatra,Priyanka Gandhi Participate In Rahul's Yatra, Bharat Jodo Yatra Madhya Pradesh, Rahul Gandhi Bharat Jodo Yatra, Rahul Gandhi Congress, Rahul Gandhi Padha Yatra, Congress Party , Indian National Congress, Inc Latest News And Updates, Sonia Gandhi, Priyanka Gandhi, Rahul Gandhi, Congress President Mallikarjun

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలిచి కేంద్రంలో అధికారంలోకి వస్తే ‘అగ్నివీర్‌’ ప్రక్రియ రద్దు చేస్తామని ప్రకటించారు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ. ఆయన నేతృత్వంలోని ‘భారత్ జోడో యాత్ర’ బుధవారం ఉదయం ఉత్తరప్రదేశ్‌లోని మావికల గ్రామం నుంచి తిరిగి ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. దేశ సేవ కోసం ప్రాణాలర్పించేందుకు యువత సిద్ధమవుతుంటే, వారి, వారి కుటుంబాలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని స్ఫష్టం చేశారు. అయితే దురదృష్టవశాత్తూ బీజేపీ ప్రభుత్వం వారి క్షేమాన్ని గాలికొదిలేసిందని, అగ్నివీర్ ప్రక్రియతో వారందరూ నిరుత్సాహానికి గురయ్యారని వ్యాఖ్యానించారు. అయితే దీనిని తాము చూస్తూ ఊరుకోమని, తమ ప్రభుత్వం ఏర్పడితే ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లో పాత విధానాన్ని పునరుద్ధరిస్తామని రాహుల్ హామీ ఇచ్చారు.

కాగా మంగళవారం మధ్యాహ్నం ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశించిన యాత్ర నివారా, సరూర్‌పూర్ మరియు బరౌత్ మీదుగా ఆయిలుమ్‌లో సాగింది. ఉత్తరప్రదేశ్‌లో యాత్ర తిరిగి ప్రారంభమైనందున, రాష్ట్రం నుండి ద్వేషాన్ని నిర్మూలించడమే తమ లక్ష్యమని కాంగ్రెస్ పేర్కొంది. మరో రెండు రోజుల పాటు ఉత్తరప్రదేశ్‌లో రాహుల్ పాదయాత్ర చేయనున్నారు. జనవరి 6న హర్యానాలో తిరిగి ప్రవేశిస్తుంది, ఆ తర్వాత జనవరి 11 నుండి 20 వరకు పంజాబ్‌లో ఉంటుంది. అనంతరం జనవరి 19న హిమాచల్ ప్రదేశ్‌లో ఒక రోజు జరుగుతుంది. ఈ క్రమంలో యాత్ర జనవరి 20న జమ్మూ కాశ్మీర్‌లోని కతువాకు చేరుకుంటుంది. ఇక చివరిగా జనవరి 30న శ్రీనగర్‌లో ముగుస్తుంది.

కాగా మంగళవారం రాహుల్ యాత్ర ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశించినప్పుడు, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా స్వాగతం పలికిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా లోనీలో జరిగిన ఒక బహిరంగ సభలో ప్రియాంక గాంధీ, తన సోదరుడు రాహుల్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. 3,000 కి.మీ నడవడం సాధారణ విషయం కాదని అన్నారు. అలాగే ఉత్తర భారతంలో చలి వణికిస్తున్న ఈ సమయంలో రాహుల్ టీ-షర్ట్‌లో తిరగడం గురించి ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇక తన సోదరుడిని దేశంలోనే పెద్ద పారిశ్రామికవేత్తలైన అంబానీ మరియు అదానీలు కొనుగోలు చేయలేరని ప్రియాంక వ్యాఖ్యానించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here