సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆడపడుచులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన మంత్రి కేటీఆర్

Minister KTR Distributes Bathukamma Sarees at Sircilla, Govt To Distribute 1.18 Crore Bathukamma Sarees, Telangana Govt Readies More than 1 Cr Bathukamma Sarees, Bathukamma Sarees Distribution, Bathukamma Sarees, Mango News, Mango News Telugu, Telangana Govt Bathukamma Sarees, Telangana Govt Bathukamma Sarees Distribution, Bathukamma Celebration, Telangana Bathukamma Celebration, Telangana Govt Bathukamma Sarees Distribution, Bathukamma Latest News And Updates, Telangana Govt News And Live Updates

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం సిరిసిల్లలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆడపడుచులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. తెలంగాణ ఆడబిడ్డలు ఘనంగా జరుపుకునే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది బతుకమ్మ చీరలను కానుకగా ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాదికి గానూ నేటి నుంచే (సెప్టెంబర్ 22, గురువారం) బతుకమ్మ చీరల పంపిణీ కాగా, రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో 24 విభిన్న డిజైన్లు, 10 రకాల ఆకర్షణీయమైన రంగులలో మొత్తం 240 రకాల త్రెడ్ బోర్డర్ తో తయారు చేయబడిన 100 శాతం పాలిస్టర్ ఫిలిమెంట్ నూలు చీరలను ఆడబిడ్డలకు పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ ఈ కార్యక్రమంలో పాల్గొని పలువురు ఆడపడుచులకు బతుకమ్మ చీరలను అందించారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మతాలకు అతీతంగా అన్ని పండుగలను ఘనంగా నిర్వహిస్తుందన్నారు. పేదింటి ఆడబిడ్డల సంతోషం కోసం దసరా, బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీ చేపడుతుందన్నారు. ఏడాదికి రూ.300 కోట్లకు పైగా ఖర్చు చేస్తూ గత ఐదేళ్లుగా ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపడుతుందన్నారు. దీనివలన నేతన్నలకు భారీగా ఉపాధి లభిస్తుందని చెప్పారు. అలాగే నేతన్నలకు రూ.5 లక్షల బీమా పథకం ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి అన్నారు. మరోవైపు సిరిసిల్లలో త్వరలోనే అపెరల్‌ పార్క్‌ను ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here