బండి సంజయ్ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ నాలుగో విడత ముగింపు సభలో పాల్గొన్న కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి

Bandi Sanjay Praja Sangrama Yatra-4 Conclusion Meeting at Pedda Amberpet Union Minister of State Sadhvi Niranjan Jyoti Attends, Bandi Sanjay Praja Sangrama Yatra-4, Bandi Sanjay Praja Sangrama Yatra, Praja Sangrama Yatra-4 Closing Meeting Today, Union Minister Sadhvi Niranjan Jyoti , Union Minister Sadhvi Niranjan Jyoti as Chief Guest, Praja Sangrama Yatra, Telangna BJP Chief Bandi Sanjay, Mango News, Mango News Telugu, Telangna BJP President Bandi Sanjay, Bandi Sanjay Yatra Closing Meet, Telangna BJP, Sadhvi Niranjan Jyoti, Praja Sangrama Yatra Latest News And Updates

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ‘ప్రజాసంగ్రామ యాత్ర’ నాలుగో విడతను ఈరోజు ముగించారు. ఈ సందర్భంగా పెద్ద అంబర్ పేటలో ఏర్పాటు చేసిన ముగింపు సభలో ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి పాల్గొన్నారు. సెప్టెంబర్ 12వ తేదీన మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మొదలైన ఈ నాలుగో విడత యాత్ర మొత్తం 8 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సాగింది. కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, మేడ్చల్, ఉప్పల్, ఎల్బీ నగర్, ఇబ్రహీంపట్నం మీదుగా ఈ యాత్ర పది రోజులపాటు 115 కి.మీ దూరం కొనసాగింది. ఇక ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, జాతీయ నేత మురళీధర్ రావు, మాజీ మంత్రి డీకే అరుణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

  • తెలంగాణ ప్రజలకు అభినందనలు, ఇక్కడి ప్రజలు స్వతహాగా పోరాట యోధులు.
  • సీఎం కేసీఆర్ రాష్ట్రంలో నిరంకుశ పాలనను సాగిస్తున్నారు.
  • తెలంగాణ ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే జైలుకి పంపుతున్నారు. బీజేపీ కార్యకర్తలు ఎవరూ జైలుకి భయపడరు.
  • ఒకవైపు తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఇంకోవైపు సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు.
  • సీఎం కేసీఆర్ కుటుంబ సంక్షేమం కోసమే పాటు పడుతున్నారు, ప్రజల కోసం పాటుపడుతోంది ప్రధాని మోదీ, బీజేపీనే.
  • తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు బాధలు పడుతున్నారు. వారందరి కష్టాలు తెలుసుకోవడానికే బండి సంజయ్ యాత్ర చేపట్టారు.
  • దేశంలో కుటుంబ పాలనను అంతమొందించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
  • ప్రధాని మోదీ పాలనలో దేశం అభివృద్ధిపథంలో దూసుకుపోతోంది.
  • తెలంగాణ ప్రజలలో పరివర్తన వచ్చింది. వారు ఇప్పుడు బీజేపీ పాలనను కోరుకుంటున్నారు.
  • తెలంగాణలో ఈసారి భాజపా అధికారంలోకి వచ్చి తీరుతుంది, అవినీతి ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here