మునుగోడు ఉపఎన్నికకు స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసిన బీజేపీ, చైర్మన్ గా జీ.వివేక్

BJP Telangana State President Bandi Sanjay Constituted Steering Committee for Munugode By-election, Munugode By-election Steering Committee, G.Vivek As Chairman, G.Vivek BJP Party, Munugode By-election BJP, BJP Telangana State President Bandi Sanjay, BJP President Bandi Sanjay, Telangana BJP Chief Bandi Sanajay, Munugode By Polls, Mango News, Mango News Telugu, Munugode Election Results, Munugode By Polls Latest News And Updates, Bandi Sanajay

మునుగోడు అసెంబ్లీ నియోజవర్గ ఉపఎన్నికను భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో త్వరలో జరగనున్న మునుగోడు ఉపఎన్నిక కోసం స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ తరపున మునుగోడు పూర్తి ఎన్నికల నిర్వహణను పర్యవేక్షించేందుకు చైర్మన్, కో-ఆర్డినేటర్, 14 మంది సభ్యులతో కూడిన ఎన్నికల స్టీరింగ్ కమిటీని చేశారు.

ఈ స్టీరింగ్ కమిటీకి మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జీ.వివేక్ వెంకటస్వామిని చైర్మన్‌గా నియమించారు. ఇక కో-ఆర్డినేటర్ గా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షడు జి.మనోహర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ ప్రేమేందర్ రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. ముందుగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి మరియు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో ఉపఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే.

మునుగోడు ఉప ఎన్నికకు బీజేపీ స్టీరింగ్ కమిటీ సభ్యులు:

 1. ఈటల రాజేందర్
 2. జితేంద్ర రెడ్డి
 3. గరికపాటి మోహన్ రావు
 4. విజయ శాంతి
 5. దుగ్యాల ప్రదీప్ కుమార్
 6. కె.స్వామి గౌడ్
 7. డాక్టర్ ఎ.చంద్రశేఖర్
 8. ఎండల లక్ష్మీనారాయణ
 9. రవీంద్ర నాయక్
 10. రాపోలు ఆనంద్ భాస్కర్
 11. యెన్నం శ్రీనివాస్ రెడ్డి
 12. కపిలవాయి దిలీప్ కుమార్
 13. టీ ఆచారి
 14. డా.దాసోజు శ్రవణ్.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here