హైదరాబాద్‌లో ‘ఫెర్రింగ్ లేబొరేటరీ ప్లాంట్’ ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Minister KTR Inaugurates Ferring Laboratories Plant Today in Hyderabad, KTR Inaugurates Ferring Laboratories Plant Today in Hyderabad, Ferring Laboratories Plant Today in Hyderabad, Ferring Laboratories Plant, Hyderabad Ferring Laboratories Plant, Ferring Laboratories Plant, Minister KTR Inaugurated Ferring Laboratories Plant Today in Hyderabad, Minister KTR Launches Ferring Laboratories Plant Today in Hyderabad, Ferring Laboratories Plant News, Ferring Laboratories Plant Latest News, Ferring Laboratories Plant Latest Updates, Ferring Laboratories Plant Live Updates, Working President of the Telangana Rashtra Samithi, Telangana Rashtra Samithi Working President, TRS Working President KTR, Telangana Minister KTR, KT Rama Rao, Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Minister of Municipal Administration and Urban Development of Telangana, KT Rama Rao Information Technology Minister, KT Rama Rao MA&UD Minister of Telangana, Mango News, Mango News Telugu,

బయోలాజికల్ సైన్స్‌లో తెలంగాణ రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని రాష్ట్ర ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో ఫెర్రింగ్‌ లేబొరేటరీస్‌ ప్లాంట్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. దాదాపు 30 మిలియన్ యూరోల పెట్టుబడితో ఈ లేబొరేటరీస్ ప్లాంట్ ఏర్పాటు చేయబడిందని తెలిపారు. ప్రపంచ పటంలో గుర్తింపు పొందిన హైదరాబాద్‌కు బెస్ట్ ఫార్మా సిటీగా అవతరించే అవకాశం ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫార్మా కంపెనీలకు అద్భుతమైన గమ్యస్థానంగా హైదరాబాద్‌ నిలుస్తోందని వెల్లడించారు. మహిళల ఆరోగ్యం కోసం ఫెర్రింగ్‌ సంస్థ చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు. తల్లీబిడ్డల ఆరోగ్యానికి అవసరమైన మందులను అత్యున్నతమైన నాణ్యతా ప్రమాణాలతో తయారు చేస్తుండటం గొప్ప విషయమని తెలిపారు.

ఫెర్రింగ్ ఫార్మాస్యూటికల్స్ అనేది స్విట్జర్లాండ్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన బహుళజాతి ఫార్మాస్యూటికల్ కంపెనీ. స్విట్జర్లాండ్‌ వేదికగా కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. తెలంగాణాలో అత్యాధునిక ఫార్మాస్యూటికల్ R&D మరియు తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఫెర్రింగ్ తన భారతీయ కార్యకలాపాలను విస్తరిస్తోంది. హైదరాబాద్‌లో ఫెర్రింగ్ ప్రాజెక్ట్ మొత్తం మూలధన పెట్టుబడికి దాదాపు రూ. 235 కోట్లు మరియు ఫార్మాస్యూటికల్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ప్రత్యక్ష ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. టీఎస్‌ఐఐసీ బయోటెక్‌ పార్కులో ఏర్పాటైన ఈ ప్లాంట్‌ ద్వారా 110 మందికి ఉద్యోగావకాశాలు లభించాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × one =