ఎవరి ఖాతాల్లోకైనా రూ.15 లక్షలు వచ్చాయా? : మంత్రి కేటిఆర్

Arya Vysya Atmiya Abhinandana Sabha, Arya Vysya Sabha, arya vysya sangham, Atmiya Abhinandana Sabha, GHMC, GHMC Elections, GHMC Elections 2020, GHMC Elections Latest News, GHMC Elections News, GHMC Elections Updates, Greater Hyderabad Municipal Corporation, KTR Participated in Arya Vysya Atmiya Abhinandana Sabha, Mango News, Minister KTR

టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటిఆర్ శుక్రవారం నాడు హైదరాబాద్‌ పీపుల్స్ ప్లాజాలో జరిగిన ఆర్య వైశ్య ఆత్మీయ అభినందన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో అన్ని వర్గాల ప్రజలు కులాలు మతాలకు అతీతంగా కలిసిమెలసి ముందుకుపోతున్నారని అన్నారు. పేదల సంక్షేమం ఒకవైపు, రాష్ట్ర అభివృద్ధి మరోవైపు చేర్చి రెండింటిని జోడెడ్ల మాదిరిగా సీఎం కేసీఆర్‌ ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో ఆర్య వైశ్య వర్గాన్ని కూడా ఆదరించి ఎమ్మెల్సీలుగా, మున్సిపాలిటీలకు చైర్మన్లుగా, మేయర్లుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా ఎంపిక చేసి సముచిత ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు. అలాగే ఆర్యవైశ్య కార్పొరేషన్‌ ఏర్పాటు అంశాన్ని కూడా సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి సానుకూల నిర్ణయం వచ్చేలా కృషి చేస్తానని చెప్పారు.

ఎవరికైనా రూ.15 లక్షలు వచ్చాయా?

హైదరాబాద్ లో ప్రశాంత వాతావరణముంటేనే పెట్టుబడులు వస్తాయని, వ్యాపారాలు సజావుగా సాగుతాయని, ఉద్యోగాలు వస్తాయని మంత్రి కేటిఆర్ అన్నారు. రాష్ట్ర ఆదాయం, రాబడి పెరిగినప్పుడే పేదల సంక్షేమం సాధ్యమవుతుందని చెప్పారు. తెలంగాణలో ఉన్నన్ని సంక్షేమ పథకాలు బహుశా భారతదేశంలో ఎక్కడ లేవేమో అని అన్నారు. కల్యాణ లక్ష్మి, రెసిడెన్సియల్ పాఠశాలలు, కేసీఆర్ కిట్, అన్నపూర్ణ భోజన పథకం, బస్తీ దవాఖానా ఈరకంగా ఎన్నో ప్రవేశపెట్టామన్నారు. రాష్ట్రానికి ఆదాయం పెరగడానికి, అభివృద్ధి చెందడానికి శాంతిభద్రతలు ముఖ్యమని,పెట్టుబడులు రావాలంటే శాంతిభద్రతలు అదుపులో ఉండాలని చెప్పారు.

ఒక బల్దియా ఎలక్షన్స్ కు పార్లమెంట్ ఎన్నికల స్థాయిలో దాదాపు 12 మంది కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, ఇతర కీలక నాయకులతో ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఈ ఆరేళ్లలో కేంద్ర ప్రభుత్వానికి రూ.2.70 లక్షల కోట్లు పన్నుల రూపంలో తెలంగాణ కడితే, వాళ్ళు కేవలం రూ.1.40 లక్షల కోట్లు మాత్రమే తిరిగి ఇచ్చారని అన్నారు. 2014 లో జనధన్ ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తానని ప్రధాని మోదీ అన్నారని, ఎవరికైనా రూ.15 లక్షలు వచ్చాయా అని సభకు హాజరైన వారిని మంత్రి కేటిఆర్ ప్రశ్నించారు. ఎవరికైనా వస్తే వాళ్ళు ప్రధాని మోదీకి ఓటేయ్యండని, రాకుంటే టిఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని చెప్పారు. ప్రజలు ఆగం కాకుండా ఆలోచించి ఓటు వేయాలని కోరారు. మతం కంటే జనహితం ముఖ్యమని మంత్రి కేటిఆర్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + two =