కేంద్ర బడ్జెట్ లో పేదలకు పనికొచ్చే ఒక్కపని కూడా లేదు : మంత్రి కేటీఆర్

Development Programs in Medchal Constituency, KTR News, KTR Participates in Various Development Programs, Mango News, medchal assembly constituency, Medchal Constituency, medchal malkajgiri assembly constituency, Minister KTR, Minister KTR Participates in Various Development Programs, Minister KTR Participates in Various Development Programs in Medchal Constituency, r KTR Participates in Various Development Programs in Medchal Constituency

తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం నాడు మేడ్చల్ నియోజకవర్గ పరిధిలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో హైదరాబాద్ జలమండలి ఆధ్వర్యంలో చేపట్టే ఓఆర్ఆర్ పేజ్-2 త్రాగునీటి సరఫరా పనులకు, అలాగే రోడ్డు విస్తరణ పనులు, చెన్నాపురం చెరువు సుందరీకరణ పనులకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్ కుమార్, జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కావ్య మరియు మున్సిపల్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

కేంద్ర బడ్జెట్ లో పేదలకు పనికొచ్చే ఒక్కపని కూడా లేదు : మంత్రి కేటీఆర్

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ కు విజ్ఞప్తి చేసి జీవో నెంబర్ 58, 59 త్వరలోనే తీసుకొచ్చి జవహర్ నగర్ లో పేదలకు ఇళ్ల పట్టాలు అందిస్తామని చెప్పారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ప్రమాదకరంగా ఉండకుండా గ్రీన్ క్యాపింగ్ పేరుతో పర్యావరణ హితంగా ఉండేందుకు రూ.147 కోట్లు ఖర్చు పెట్టి క్యాపింగ్ పూర్తిచేశామన్నారు. అలాగే దక్షిణ భారతదేశంలో చెత్తనుండి విద్యుత్ ఉత్పత్తి చేసే అతిపెద్ద 24 మెగా వాట్ల ప్లాంట్ ను రూ.485 కోట్లతో ప్రారంభించామని, త్వరలోనే రెండో దశ కింద రూ.550 కోట్లతో మరో ప్లాంట్ కూడా పూర్తిచేస్తామన్నారు. మొత్తం రూ.1200 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్ పేజ్-2 త్రాగునీటి సరఫరా పనులకు చేపడుతున్నామని తెలిపారు. మరోవైపు నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో పేదలకు పనికొచ్చే ఒక్కపని కూడా లేదని అన్నారు. ఎన్ని విజ్ఞప్తులు చేసినా కూడా తెలంగాణ వంటి పురోగమన రాష్ట్రానికి మొండి చెయ్యి చూపెట్టారన్నారు. కేంద్రం ఇవ్వనంత మాత్రాన ఏది ఆగదని, ప్రజల ఆశీర్వాదం ఉంటే సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఇదే పద్ధతిలో అభివృద్ధి ప్రథాన ముందుకు దూసుకెళ్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + seven =