టీఎస్ ఐసెట్-2021 కౌన్సెలింగ్‌ షెడ్యూల్ వివరాలు ఇవే…

ICET Counseling In Telangana, ICET-2021 Counseling Schedule, ICET-2021 Counseling Schedule Released, Mango News, Telangana ICET, Telangana ICET Counseling Schedule, Telangana ICET Counseling Schedule Released, Telangana ICET-2021 Counseling, Telangana ICET-2021 Counseling Schedule, Telangana ICET-2021 Counseling Schedule Released, Telangana TS ICET 2021, Telangana TS ICET Counselling 2021, TS ICET Counselling 2021, TSICET Counselling 2021

తెలంగాణ రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో సీట్ల భర్తీకి సంబంధించిన టీఎస్ ఐసెట్-2021 కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదలైంది.‌ నవంబరు 3వ తేదీ నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం అవుతుందని రాష్ట్ర ఉన్నత విద్యామండలి వెల్లడించింది. రెండు విడతల్లో సీట్ల భర్తీ ప్రక్రియ పూర్తయ్యేలా షెడ్యూల్‌ రూపొందించారు. ముందుగా తెలంగాణలో ఐసెట్-2021 ప్రవేశ పరీక్షను ఆగస్టు 19, 20వ తేదీల్లో నిర్వహించగా, సెప్టెంబర్ 23న ఫలితాలను విడుదల చేశారు. ఐసెట్‌ పరీక్షలో మొత్తం 90.09 శాతం మంది ఉత్తీర్ణులయినట్టు తెలిపారు.

టీఎస్‌ ఐసెట్-20201 కౌన్సెలింగ్‌ షెడ్యూల్:

తొలివిడత:

  • ఆన్‌లైన్ లో ప్రాథమిక సమాచారం నమోదు, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ – నవంబర్ 3 నుంచి నవంబర్ 9 వరకు
  • స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థుల సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసే తేదీలు – నవంబర్ 6 నుంచి నవంబర్ 10 వరకు
  • వెబ్‌ ఆప్షన్స్ పక్రియ – నవంబర్ 6 నుంచి నవంబర్ 11 వరకు
  • వెబ్‌ ఆప్షన్స్ ఫ్రీజింగ్ – నవంబర్ 11
  • ఎంబీఏ, ఎంసీఏ మొదటి విడత సీట్లు కేటాయింపు – నవంబర్ 14
  • వెబ్ సైట్ ద్వారా ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ – నవంబర్ 14 నుంచి నవంబర్ 18 వరకు

చివరి విడత:

  • ఆన్‌లైన్ లో ప్రాథమిక సమాచారం నమోదు, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ – నవంబర్ 21
  • స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థుల సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసే తేదీలు – నవంబర్ 22
  • వెబ్‌ ఆప్షన్స్ పక్రియ – నవంబర్ 22 నుంచి నవంబర్ 23 వరకు
  • వెబ్‌ ఆప్షన్స్ ఫ్రీజింగ్ – నవంబర్ 23
  • చివరి విడత ఎంబీఏ, ఎంసీఏ సీట్లు కేటాయింపు – నవంబర్ 26
  • వెబ్ సైట్ ద్వారా ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ – నవంబర్ 26 నుంచి నవంబర్ 28 వరకు
  • స్పాట్ అడ్మిషన్స్ గైడ్ లైన్స్ వెబ్ సైట్ లో అందుబాటు : నవంబర్ 28
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + seventeen =