141 మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్ల నియామకం, గ్రూప్‌-4 నోటిఫికేషన్‌ పై మంత్రి కేటీఆర్ స్పందన

Minister KTR Respond over Group-4 Notification and Ward Officers Recruitment in All 141 Municipalities,Minister Ktr,Appointment Of Ward Officers, Hyderabad 141 Municipalities, Group-4 Notification,Mango News,Mango News Telugu,Mango News,Mango News Telugu,Telangana Government,Telangana Govt Jobs 2022,Telangana Govt Jobs,Telangana Govt Jobs News And Live Updates,Telangana Govt Jobs Notification,Telangana Govt Jobs Notifications 2022,Telangana Govt Notifications 2022

తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్‌-4 నోటిఫికేషన్‌ విడుదల అయిన విషయం తెలిసిందే. గ్రూప్-4 కింద 25 విభాగాలకు చెందిన 9,168 పోస్టులను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) భర్తీ చేయనుంది. ఇందులో జూనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అకౌంటెంట్‌, జూనియర్‌ ఆడిటర్‌ తో పాటుగా వార్డు ఆఫీసర్‌ పోస్టులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో గ్రూప్-4 నోటిఫికేషన్ ద్వారా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ పరిధిలో వార్డు ఆఫీసర్‌ పోస్టులు భర్తీ చేయడంపై ఆ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. గ్రూప్‌-4 ద్వారా వార్డు ఆఫీసర్ల నియామకం ఒక మార్గదర్శక చొరవ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

“టీఎస్‌పీఎస్సీ తాజాగా గ్రూప్-4 నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో భాగంగా ఒక మార్గదర్శక చొరవలో తెలంగాణ ప్రభుత్వం మొత్తం 141 మున్సిపాలిటీలలో వార్డు ఆఫీసర్లను నియమించనుంది. దీని ద్వారా పౌర సమస్యలపై మరింత దృష్టి సారించవచ్చు మరియు వార్డు కౌన్సిలర్‌లతో సమన్వయం చేసుకోవడంలో ఈ నియామకాలు మరింత సహాయపడతాయి. ఈ నియామకాలకు అనుమతి ఇచ్చిన సీఎం కేసీఆర్ కు నా కృతజ్ఞతలు” అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here