బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

PM Modi Extends Wishes To BJP National President JP Nadda on His 62nd Birthday Today,PM Modi,BJP National President,JP Nadda,Mango News,Mango News Telugu,JP Nadda 62nd Birthday,JP Nadda Birthday,JP Nadda Birthday Latest News and Updates,Telangana Bjp,Telangana Cm Kcr,Trs Party,Brs Party,Ysrtp,Brs Party Latest News And Updates,Bjp Latest News and Updates,

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా 62వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ నడ్డా నాయకత్వాన్ని కొనియాడారు. నడ్డా తన నాయకత్వ లక్షణాలతో భాజపాలో కొత్త ఉత్సాహాన్ని, శక్తిని నింపారని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని ట్విట్టర్ ద్వారా నడ్డాకు శుభాకాంక్షలు వెల్లడించారు. ‘భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారికి జన్మదిన శుభాకాంక్షలు. తన నాయకత్వ సామర్థ్యంతో భాజపాలో కొత్త ఉత్సాహాన్ని, కొత్త శక్తిని నింపే పనిని ఆయన పూర్తి చేశారు. భగవంతుడు ఆయనకు దీర్ఘాయుష్షును, ఆరోగ్యవంతమైన జీవితాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను’ అని హిందీలో తెలిపారు.

కాగా జేపీ నడ్డా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నాయకుడు. ఆర్ఎస్ఎస్ సంస్థాగత వ్యక్తి మరియు ఆయన పార్టీ శ్రేణుల ద్వారా ఎదిగారు. ఆర్ఎస్ఎస్ విద్యార్థి విభాగం ఏబీవీపీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, అంచెలంచెలుగా పార్టీలో వివిధ బాధ్యతలను చేపట్టారు. బీజేపీ యువజన విభాగం అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన తద్వారా జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందారు. ఈ క్రమంలో ఆయన 2020 నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇక నడ్డాకు హిమాచల్ ప్రదేశ్‌లో మంత్రిగా, అలాగే కేంద్రంలో క్యాబినెట్ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ప్రధాని మోదీతో పాటుగా పలువురు పార్టీ నేతలు కూడా నడ్డాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here