వీఆర్ఏల పోరాటానికి అండగా ఉంటాం – బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్

Huzurabad MLA Etela Rajender Says, BJP Will Support For VRA Protests in Telangana

తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ఏలు చేస్తున్న పోరాటానికి అండగా ఉంటాం అని హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలలోకి వెళ్తాను అని అంటున్నారని.. అయితే దానికంటే ముందు రాష్ట్రంలోని సమస్యలను పరిష్కరించాలని కోరారు. వీఆర్ఏల డిమాండ్స్ పై దృష్టి పెట్టాలని రాజేందర్ సూచించారు. తమ సమస్యల పరిష్కారానికి వీఆర్ఏలు చేస్తున్న మహాధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడారు.

ఎంతో వైభవం ఉన్న రెవెన్యూ శాఖ కేసీఆర్ సీఎం అయ్యాక ప్రాభవం కోల్పోయిందని అన్నారు. నిత్యం గ్రామాలలో ప్రజలతో మమేకమయ్యే రెవెన్యూ శాఖకు మంత్రి లేకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఎక్కడైనా వీఆర్ఏలు మంచిగుంటేనే గ్రామాలు మంచిగుంటాయన్నారు. వీఆర్ఏలకు సొంత గ్రామాల్లో ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్ళను కేటాయించాలన్నారు. వీఆర్ఏల పోరాటానికి బీజేపీ పార్టీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. అలాగే, వీఆర్ఏల సమస్యలపై రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ ప్రశ్నిస్తుందని ఈటల రాజేందర్ అన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × two =