ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి, కారుణ్య నియామకపత్రాలు పంపిణీ చేసిన మంత్రి కొప్పుల

Minister Koppula Distributed Compassionate Appointment Letters to Certain People Advised Unemployed to Use Govt Schemes,Minister Koppula,Distributed Compassionate Appointment Letters,to Certain People,Advised Unemployed to Use Govt Schemes,Mango News,Mango News Telugu,Tdp Chief Chandrababu Naidu,AP CM YS Jagan Mohan Reddy,YS Jagan News And Live Updates, YSR Congress Party, Andhra Pradesh News And Updates, AP Politics, Janasena Party, TDP Party, YSRCP, Political News And Latest Updates

నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గురుకుల విద్యాలయాల్లో విద్యనభ్యసించిన వారిలో పలువురికి హైదరాబాద్ బంజారాహిల్స్ లోని మంత్రుల నివాస ప్రాంగణంలో శనివారం నాడు మంత్రి కొప్పుల ఈశ్వర్ కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలను అందచేశారు. ఎక్కడ మారుమూల ప్రాంతాల్లో జన్మించి చదువుకు దూరమవుతున్నమానుకునే వారిలో అలాంటి అపోహలు తొలగించాలన్న మంచి లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గురుకుల విద్యా విధానం పకడ్బందీగా అమలు చేస్తుందని చెప్పారు.

అన్ని వసతులు, పోషకారం అందిస్తున్న ప్రభుత్వం, కార్పొరేట్‌ స్థాయి విద్యాబోధన అందిస్తుందని ఈ సందర్బంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు విలువలతో కూడిన విద్యను అందించడం కోసం సీఎం కేసీఆర్ గురుకుల పాఠశాలల వ్యవస్థను మరింత బలోపేతం చేశారని చెప్పారు. ఇందులో భాగంగానే మైనార్టీల బాలికల కోసం రాష్ట్రవ్యాప్తంగా 204 తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాలలను ప్రారంభించింది. బాల బాలికల కోసం విడివిడిగా ప్రారంభమైన పాఠశాలలు, నేడు అనేక మందికి దారి దీపాలవుతున్నాయని చెప్పారు. విశాలమైన తరగతి గదులు, ఉన్నత విద్యావంతులైన ఉపాధ్యాయుల నిరంతర కృషి, తపనతో విద్యార్థినులను ఉత్తములుగా తీర్చిదిద్దుతున్నారని, ఇంతటి మంచి అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆశించిన ఫలితాలు రావడంతో గురుకుల పాఠశాలలో పిల్లలను చేర్పించడానికి తల్లిదండ్రులు కూడ ఆసక్తి చూపడం అభినందనీయమని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.

కారుణ్య నియామక పత్రాలు పొందిన వారంతా తమ తమ విధులు సక్రమంగా నిర్వహించుకోవాలని గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి రోనాల్డ్ రోస్ సూచించారు. రెగ్యులర్ నియామకాలు ఆలస్యం అవుతున్న, గురుకులాల్లో చదువుకున్న వారికి అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నామని అయన చెప్పారు. ప్రభుత్వం కల్పించిన ఇంత చక్కని అవకాశంతో త్వరలోనే ప్రమోషన్స్ పొందే అవకాశం ఉంటుందని చెప్పారు. గురుకుల పాఠశాలలో విశాలమైన తరగతి గదులు, ఉపాధ్యాయుల నిరంతరం కృషితో విద్యార్థినులను ఉత్తములుగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ప్రభుత్వ స్ఫూర్తి, లక్ష్యాన్ని ప్రతి ఒక్కరికి తెలియచేయాల్సిన బాధ్యత అందరిపై ఉంటుందన్నారు. కారుణ్య నియామక పత్రాలు పొందిన వారు తమకు ప్రభుత్వం నియామాకాల్లో అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కార్యదర్శి హన్మంత్ నాయక్, గురుకుల విద్య సంస్థల సిబ్బంది పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × two =