మే 14న తెలంగాణలో పర్యటించనున్న కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా

Union Home Minister Amit Shah will Visit Telangana on May 14th, Home Minister Amit Shah will Visit Telangana on May 14th, Union Home Minister Amit Shah will Visit Telangana, Union home minister will tour Telangana, Union home minister Amit Shah will tour Telangana, Union home minister Amit Shah Telangana tour, Praja Sangrama Yatra 2, Praja Sangrama Yatra, BJP Telangana Bandi Sanjay Kumar, BJP, Telangana, Bandi Sanjay, Amit Shah Telangana tour, home minister Amit Shah Telangana tour News, home minister Amit Shah Telangana tour Latest News, home minister Amit Shah Telangana tour Latest Updates, Mango News, Mango News Telugu,

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్రంలో రెండో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ చేపడుతున్న సంగతి తెలిసిందే. నేటితో యాత్ర 26వ రోజుకు చేరుకోగా, రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రను మే 14వ తేదీతో ముగించనున్నారు. ఈ నేపథ్యంలో మే 14వ తేదీన మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని తుక్కుగూడలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని తెలంగాణ బీజేపీ నిర్ణయించింది. ఈ సభకు బీజేపీ కీలక నేత, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా హాజరుకానున్నట్టు ప్రకటించారు.

అమిత్ షా హాజరు కానున్న నేపథ్యంలో ఈ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేలా బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. జన సమీకరణ సహా ఇతర అంశాలపై పార్టీ నేతలకు బండి సంజయ్ ఇప్పటికే కీలక సూచనలు చేశారు. ఇటీవలే రాష్ట్రంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండు రోజులు పర్యటించడం, తాజాగా అమిత్ షా పర్యటన ఖరారు కావడం, టీఆర్ఎస్ నేతల ప్రతివిమర్శలతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం క్రమంగా వేడెక్కుతుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here