త్వరలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ప్రారంభం – మంత్రి కేటిఆర్

Cable Stay Bridge on Durgam Cheruvu, Durgam Cheruvu, Durgam Cheruvu Bridge, Durgam Cheruvu Cable Bridge, Durgam Cheruvu Cable Bridge News, Durgam Cheruvu Cable Bridge Opening, Durgam Cheruvu Cable Bridge Updates, Durgam Cheruvu Cable Stay Bridge, Minister KTR Avout Cable Stay Bridge on Durgam Cheruvu, Stay Bridge on Durgam Cheruvu to be Unveiled Very Soon

హైదరాబాద్ నగరంలోని దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జిని త్వరలో ప్రారంభించబోతున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల మంత్రి కేటిఆర్ ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధిలో మౌలిక సదుపాయాల కల్పన కీలకమైన అంశమని, తెలంగాణ ప్రభుత్వం 60 శాతం బడ్జెట్‌ను మౌలిక సదుపాయాల కల్పనకు ఖర్చు చేస్తోందని అన్నారు. ఈ కేబుల్ బిడ్జి నిర్మాణంలో పాలుపంచుకున్న ఇంజినీర్లకు, ప్రభుత్వ అధికారులకు, జీహెఛ్ఎంసీ అధికారులకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ కేబుల్ బ్రిడ్జి వీడియోను మంత్రి కేటిఆర్‌ ట్విట్టర్లో పోస్టు చేశారు. రూ.184 కోట్ల వ్యయంతో 754.38 మీటర్ల పొడవుగా నిర్మించిన ఈ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − two =