కుమ్రంభీమ్ ఆదివాసీ భవన్, సేవాలాల్ బంజారా భవన్ లను 17వ తేదీన ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

CM KCR To Inagurate Kumram Bheem Adivasi Bhavan Sevalal Banjara Bhavan on September 17, KCR To Inaugurate Adivasi Bhavan, KCR To Inaugurate Kumram Bheem Adivasi Bhavan , Kumram Bheem Adivasi Bhavan , Sevalal Banjara Bhavan, KCR To Start Sevalal Banjara Bhavan, Mango News, Mango News Telugu, Kumram Bheem Adivasi Bhavan, Sevalal Banjara Bhavan, CM KCR To Inagurate on Sep17, CM KCR Latest News And Updates, Telangna CM KCR, Kumram Bheem

రాష్ట్రంలో ఆదివాసీ, గిరిజన తెగల సమగ్ర అభ్యున్నతే లక్ష్యంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మార్గనిర్దేశంలో తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుంది. ఆదివాసీ, గిరిజనుల సంస్కృతి పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. తాజాగా కుమ్రంభీమ్ ఆదివాసీ భవన్, సేవాలాల్ బంజారా భవన్ ప్రారంభంపై ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది.

ఆదివాసీ, గిరిజనుల ఆత్మగౌరవ ప్రతీకలుగా ప్రత్యేక భవనాలు:

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో రూ.24 కోట్ల 68 లక్షల వ్యయంతో కుమ్రంభీమ్ ఆదివాసీ భవన్ ను, రూ.24.43 కోట్ల వ్యయంతో సేవాలాల్ బంజారా భవన్ లను ఆధునిక వసతులతో ప్రభుత్వం నిర్మించింది. ఈ ఆత్మగౌరవ భవనాలను ఈ నెల 17వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రారంభించ నున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా రూ.75 కోట్ల 86 లక్షల వ్యయంతో 32 ఆదివాసీ, బంజారా భవనాలను ప్రభుత్వం నిర్మించింది. హైదరాబాద్ లో 3, పూర్వ జిల్లా కేంద్రాల్లో 10, ఐటిడిఏలు ఉన్న 3 చోట్లతో పాటు 12 ఎస్టీ నియోజకవర్గం కేంద్రాల్లో ఈ భవనాలు ఉన్నాయి.

ఘనంగా ఆదివాసీ, గిరిజన జాతరలు:

ఆదివాసీ యోధుడు కుమ్రంభీమ్, బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ ల జయంతులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. దక్షిణాది కుంభమేళాగా పేరుగాంచిన, ఆసియాలోనే అతిపెద్దదైన సమ్మక్క-సారలమ్మ జాతరను అధికారికంగా నిర్వహిస్తుంది. వీటితో పాటు నాగోభా జాతర, జంగుబాయి జాతర, బౌరంపూర్ జాతర, ఎరుకల నాంచారమ్మ జాతర, గాంధారి మైసమ్మ, తదితర జాతరలను అధికారికంగా జరుపుతున్నారని తెలిపారు. సమ్మక్క-సారలమ్మ జాతరతో పాటు ఇతర ఆదివాసీ గిరిజన జాతరల నిర్వహణ, వసతుల కల్పనకు తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి గత ఎనిమిది ఏండ్లలో ప్రభుత్వం రూ.354 కోట్లను ఖర్చుచేసిందన్నారు.

ఆదివాసీ సంస్కృతికి ప్రతిబింబాలుగా మ్యూజియంల ఏర్పాటు:

ఆదివాసి హక్కుల కోసం పోరాడి అమరుడైన కుమ్రం భీమ్ స్మారక కేంద్రాన్ని జోడేఘాట్ వద్ద ప్రభుత్వం నెలకొల్పింది. నూతనంగా ఏర్పాటు చేసిన ఆసిఫాబాద్ జిల్లాకు కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాగా ప్రభుత్వం పేరు పెట్టింది. అలాగే మేడారం వద్ద కోయ గిరిజన తెగ సంస్కృతి, సంప్రదాయాలను చాటే విధంగా సమ్మక్క-సారలమ్మ మ్యూజియంను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మ్యూజియంల ఏర్పాటుకు ప్రభుత్వం మొత్తం రూ.22 కోట్ల 53 లక్షలను ఖర్చు చేసిందని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + 1 =