నగరంలో కొత్తగా 31 ప్రాంతాల్లో సీవ‌రేజ్ ప్లాంట్ల నిర్మాణానికి రూ.3866 కోట్లు కేటాయింపు – మంత్రి కేటీఆర్

Drinking Water Supply In Outskirts of GHMC, Drinking Water Supply Works, Drinking Water Supply Works In Outskirts of GHMC, Greater Hyderabad Municipal Corporation, Hyderabad Metropolitan Water Supply and Sewerage Board, Mango News, money for improving drinking water supply, TRS Government Releases 1200 Crores To HMWSSB, TRS Government Releases 1200 Crores To HMWSSB To Speed Up Drinking Water Supply Works In Outskirts of GHMC, urban local bodies

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ నగరంలో రాబోయే ప‌దేళ్ల అవ‌స‌రాల‌ను దృష్టిలో పెట్టుకుని సీవ‌రేజ్ ప్లాంట్ల‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని, అందుకు కేబినెట్ ఆమోదం తెలిపింద‌ని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్ లో 100 శాతం మురుగునీటి శుద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. నగరంలో కొత్తగా 31 ప్రాంతాల్లో 1260 ఎంఎల్డీ కెపాసిటీ సీవ‌రేజ్ ప్లాంట్ల నిర్మాణానికి రూ.3,866.21 కోట్లను కేబినెట్ కేటాయించిందని మంత్రి కేటీఆర్ తెలిపారు.

అలాగే హైద‌రాబాద్ చుట్టుప‌క్క‌ల ఉండే ప్ర‌జ‌ల‌కు మంచి నీటి నిర్వహణ కోసం మరో రూ.1200 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.దీంతో కొత్తగా ప్రజలకు 2 లక్షల కొత్త నీటి కనెక్షన్స్ అందుబాటులోకి వస్తాయన్నారు. మురుగు నీరు శుద్ధి మరియు మంచినీటి కోసం హైదరాబాద్ నగరానికి ఒకే రోజులో రూ.5000 కోట్లు మంజూరు చేస్తూ జీవో జారీ చేయడం గొప్ప విషయమని మంత్రి కేటీఆర్ అన్నారు. హైద‌రాబాద్ ప్ర‌జ‌ల త‌ర‌పున సీఎం కేసీఆర్‌ కు ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నానని పేర్కొన్నారు. వచ్చే రెండేళ్లలోనే ఈ పనులన్నీ పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + seventeen =