త్వరలో మంత్రి కేటీఆర్‌ స్విట్జర్లాండ్‌ పర్యటన.. దావోస్‌ వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సమ్మిట్‌కు హాజరు

Minister KTR To Visit Switzerland For Participating Davos World Economic Forum Summit-2023, Minister KTR Participating Davos World Economic Forum Summit-2023, Davos World Economic Forum Summit-2023, 2023 Davos World Economic Forum Summit, Davos World Economic Forum Summit, Minister KTR To Visit Switzerland, Minister KTR Switzerland Tour, Minister KTR Switzerland Visit, Telangana Minister KTR, 2023 Davos World Economic Forum Summit News, 2023 Davos World Economic Forum Summit Latest News And Updates, 2023 Davos World Economic Forum Summit Live Updates, Mango News, Mango News Telugu

తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు త్వరలో స్విట్జర్లాండ్‌ పర్యటనకు వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమ్మిట్-2023లో పాల్గొననున్నారు. ఈ సమ్మిట్ ఈనెల 16వ నుంచి ప్రారంభమవనుంది. అలాగే దీనికిముందు ఈనెల 15వ తేదీన జూరిచ్‌ నగరంలో జరిగే మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమంలోనూ కేటీఆర్‌ పాల్గొననున్నారు. ప్రపంచంలోని దిగ్గజ కంపెనీల సీఈవోలు, ప్రతినిధులు పాల్గొనే ఈ సమ్మిట్‌లో తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా మంత్రి కేటీఆర్‌ ఈ సమ్మిట్‌లో పాల్గొంటున్నారు. కాగా మంత్రి కేటీఆర్ తొలిసారిగా 2018 సంవత్సరంలో ఐటీ మినిస్టర్‌ హోదాలో దావోస్ పర్యటనకు వెళ్లారు. ఇక గతేడాది మే నెలలో దావోస్ పర్యటనకు వెళ్లిన ఆయన ప్రముఖ బీమా సంస్థ స్విస్‌ రీ, ఈకామర్స్ సంస్థ మీషో, స్పానిష్ ఫార్మా కంపెనీ కీమో మరియు లూలు గ్రూప్ వంటి దిగ్గజ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని రాష్ట్రానికి వందలకోట్లు పెట్టుబడులు తీసుకురావడం తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా కొంతమంది రాష్ట్ర ప్రభుత్వ అధికారుల బృందంతో మంత్రి కేటీఆర్ మరో రెండు రోజుల్లో స్విట్జర్లాండ్‌కు వెళ్లనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − 1 =