అకాల వర్షం, వడగండ్లతో పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో మంత్రి ఎర్రబెల్లి విస్తృత పర్యటన

Minister Errabelli Dayakar Rao Extensive Tour In Affected Areas by Untimely Rain and Hail,Minister Errabelli Dayakar Rao,Errabelli Tour In Affected Areas,Errabelli Dayakar Tour on Untimely Rain and Hail Areas,Mango News,Mango News Telugu,Minister Errabelli Dayakar Rao Inspects Rain Damage,Minister Errabelli Dayakar Latest News,Minister Errabelli Dayakar Latest Updates,Minister Errabelli Dayakar Live News,Telangana Latest News,Telangana Rainfall Latest Updates

అకాల వర్షం అపార నష్టాన్ని కలిగించింది. వడగండ్లు రైతులకు కడగండ్లు మిగిల్చాయి. ప్రకృతి ప్రకోపించింది. రైతులు తీరని నష్టాలలో కూరుకుపోయారు. నష్టపోయిన బాధిత రైతులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుంది. రైతులు ఆందోళన పడాల్సిన పనిలేదు. అధికారులు నష్టాలు అంచనా వేస్తున్నారు. ఆ నివేదికలు రాగానే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి, నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పించే బాధ్యత తాను తీసుకుంటాను అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శనివారం రాత్రి కురిసిన వడగండ్ల వానకు పాలకుర్తి నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో తీవ్ర పంట నష్టం జరిగింది. ఒకవైపు పంట నష్టాల అంచనా వేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి స్వయంగా రంగంలోకి దిగారు. నేరుగా రైతుల పొలాలకు చెలకల వద్దకు వెళ్లి రోజంతా పంట నష్టాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. వారి బాధలు విన్నారు. కన్నీరు పెట్టుకున్న రైతులను అక్కున చేర్చుకుని ఓదార్చారు. మంత్రిని చూడగానే బోరుమన్న రైతులు, తమ సమస్యలు విన్నవించుకున్నారు. అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టిన రైతులు కొందరు, కౌలుకు తీసుకొని సాగు చేస్తున్న రైతులు మరికొందరు..భర్త లేకపోయినా ధైర్యంగా సాగు చేసిన మహిళలు మరికొందరు…నేలతల్లిని నమ్ముకొని తమ కష్టాలు తీరుతాయని, ఎంతో ఆశగా వేసిన పంట చేతికి వచ్చే సమయానికి కురిసిన అకాల వడగండ్ల వాన రైతుల కుటుంబాల్లో కడగండ్లు మిగిల్చాయి. దీంతో రైతులను మంత్రి దయాకర్ రావు ఓదార్చారు. ధైర్యం చెప్పారు, అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పరిహారం ఇస్తామని పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆయా చోట్ల రైతులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, “నేను స్వయంగా రైతుని. రైతు కుటుంబం నుంచి వచ్చాను. రైతుల కష్టాలు తెలిసిన వాడివి. రైతుల పక్షపాతిని. ఈరోజు వడగండ్ల వర్షాలకు జరిగిన భారీ నష్టాన్ని కళ్లారా చూశాను. మనసు ద్రవించింది. ఎంతో బాధ కలిగింది. రైతులు తీవ్రంగా నష్టపోయారు. వారి నష్టాల నుంచి బయటపడేసే బాధ్యత నేను తీసుకుంటాను. సీఎం కేసీఆర్ కూడా రైతు పక్షపాతి. కేసీఆర్ రైతుల కోసం ఎంతో చేశారు చేస్తున్నారు. సీఎం దృష్టికి తీసుకెళ్లి రైతు నష్టాలకు పరిహారం ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను” అని రైతులకు భరోసా ఇచ్చారు. ప్రస్తుతం అధికారులు నష్టాలు అంచనా వేస్తున్నారు. ఆ అంచనాల నివేదికలు రాగానే రైతులకు పరిహారం విషయమై సీఎం దగ్గరికి వెళ్తాను. అప్పటిదాకా రైతులు ఓపిక పట్టాలని ఎర్రబెల్లి చెప్పారు.

అధికారులు అందించిన ప్రాథమిక అంచనాల ప్రకారం పాలకుర్తి నియోజకవర్గంలో ఆరు మండలాల్లో 76 గ్రామాలు అకాల వడగండ్ల వర్షానికి లోనయ్యాయి. 15వేల ఎకరాలలో పంట నష్టాలు జరిగాయి. దాదాపు పదివేల మంది రైతులు పంట నష్టాలకు గురయ్యారు. తొర్రూరు మండలంలో అత్యధికంగా 19 గ్రామాలలోని 2000 మంది రైతులు 6000 ఎకరాల విస్తీర్ణంలో వరి, మొక్కజొన్న, మామిడి, మిర్చి వంటి పలు పంటలు నష్టపోయారు. పెద్ద వంగర మండలంలో15 గ్రామాలలో 1100 మంది రైతులు 3 వేల ఎకరాల విస్తీర్ణంలో పంటలు నష్టపోయారు. రాయపర్తి మండలంలోనీ 13 గ్రామాల్లో 500 ఎకరాల తీర్ణంలో 200 మంది రైతులు పంటలు నష్టపోయారు. పాలకుర్తి మండలం లోని 13 గ్రామాల్లో 200 మంది రైతులు 500 ఎకరాల విస్తీర్ణంలో పంటలు నష్టపోయారు. దేవరుప్పుల మండలంలోని 10 గ్రామాలలోని 400 మంది రైతులు, వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో వివిధ పంటలను నష్టపోయారు. కొడకండ్ల మండలంలోని ఆరు గ్రామాలలో రైతులు వడగండ్ల వానకు బలయ్యాయి. 1500 మంది రైతులు 3500 ఎకరాల విస్తీర్ణంలో పంటలు నష్టపోయారు.

ఇదిలా ఉండగా జనగామ జిల్లాలో 9 మండలాలు 67 గ్రామాలు తీవ్రంగా నష్టానికి గురయ్యాయి. 3950 ఎకరాల విస్తీర్ణంలో వరి, 1600 ఎకరాల విస్తీర్ణంలో మొక్కజొన్న, 375 ఎకరాల విస్తీర్ణంలో మిర్చ, 25 ఎకరాల విస్తీర్ణంలో జొన్న, 25 ఎకరాల విస్తీర్ణంలో పొగాకు, 50 ఎకరాల విస్తీర్ణంలో మామిడి, వంటి పంటలు మొత్తం జిల్లాలో దాదాపు 6500 ఎకరాల విస్తీర్ణంలో పంటల నష్టాలు జరిగాయని సంబంధిత శాఖల అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. అలాగే మహబూబాబాద్ జిల్లాలో 12 మండలాలు 250 గ్రామాల్లోని వివిధ రైతులు పంట నష్టాలకు గురయ్యారు. 4800 ఎకరాలలో వరి, 6600 ఎకరాల విస్తీర్ణంలో మొక్కజొన్న, 3500 ఎకరాల విస్తీర్ణంలో మిర్చి, 2500 ఎకరాల విస్తీర్ణంలో మామిడి, మొత్తం జిల్లాలో 17400 ఎకరాల విస్తీర్ణం వివిధ పంటల నష్టం సంభవించినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వివరించారు. ఈ నివేదికలు ప్రాథమిక అంచనాలు మాత్రమేనని ఇంకా సర్వే జరుగుతుందని పూర్తి నివేదికలు వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందేలా చేస్తామని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి వెంట మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ శశాంక్, జనగామ జిల్లా కలెక్టర్ శివలింగయ్య, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ఆర్డీవోలు కృష్ణవేణి, రమేష్, వ్యవసాయ రెవెన్యూ ఇతర శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతు సమితి సభ్యులు, రైతులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 − 1 =