నేడే ఔరంగాబాద్‌లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ.. సీఎం కేసీఆర్‌ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి

BRS To Hold Huge Public Meeting in Aurangabad Maharashtra Today CM KCR will Attend,BRS To Hold Huge Public Meeting in Aurangabad,Public Meeting in Aurangabad Maharashtra Today,CM KCR will Attend Public Meeting in Maharashtra,Mango News,Mango News Telugu,CM KCR to attend BRS Public Meeting,Aurangabad Decks Up For Massive BRS,Pumped up BRS gears up for Aurangabad,BRS Public Meeting Latest News,BRS Public Meeting Latest Updates,BRS Public Meeting Live News,CM KCR News And Live Updates

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ముందుగా పొరుగునున్న మహారాష్ట్రపై ఆ పార్టీ ఫుల్ ఫోకస్ పెట్టింది. ఏ క్రమంలో ఇప్పటికే అక్కడ రెండు భారీ బహిరంగ సభలు నిర్వహించిన బీఆర్ఎస్, సోమవారం మూడో బహిరంగ సభ నిర్వహించడానికి సమాయత్తమైంది. గత కొన్ని వారాల క్రితం నాందేడ్ మరియు కంధార్-లోహాలో భారీ సభలు నిర్వహించిన ఆ పార్టీ నేడు ఔరంగాబాద్‌లో మరో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తోంది. దీనికి ముఖ్య అతిథిగా సీఎం కేసీఆర్ హాజరవనున్నారు. కాగా నిన్న (ఆదివారం) తెలంగాణలోని చేవెళ్లలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొనడం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వం మరియు సీఎం కేసీఆర్ పైన సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ నేపథ్యంలో నేడు ఔరంగాబాద్‌లోని అంకాస్ మైదాన్‌లో నిర్వహించనున్న బీఆర్ఎస్ సభలో సీఎం కేసీఆర్ చేయబోయే ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అమిత్ షా విమర్శలకు ధీటుగా ఆయన కౌంటర్ ఇస్తారని బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి. దీంతో నేటి సభపై, అలాగే సీఎం కేసీఆర్ ప్రసంగంపై రాజకీయ వర్గాలతో పాటు సామాన్య ప్రజలు కూడా ఉత్సుకతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నేటి సభకు భారీ సంఖ్యలో ప్రజలను సమీకరించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి నేతృత్వంలో ఐడీసీ చైర్మన్‌ వేణుగోపాలాచారి, మహారాష్ట్ర బీఆర్‌ఎస్‌ పార్టీ కిసాన్‌ సమితి అధ్యక్షుడు మాణిక్‌ కదం, మాజీ ఎమ్మెల్యే శంకరన్న దోండ్గే తదితరులకు బహిరంగ సభ ఏర్పాట్ల బాధ్యతలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. దాదాపు లక్షన్నర మందిని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గత రెండు సభలను మించి ఈ సభను విజయవంతం చేసేలా కసరత్తు చేస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + 6 =