టీఎస్‌ఆర్టీసీ పెట్రోల్ పంప్ అవుట్‌లెట్స్ ప్రారంభం

Fuel Outlets, Fuel Outlets a Joint Venture of TSRTC and HPCL, HPCL, Joint Venture of TSRTC and HPCL, Minister Puvvada Ajay Kumar, Minister Puvvada Ajay Kumar Launched Fuel Outlets, Puvvada Ajay Kumar, telangana, Telangana News, TSRTC

తెలంగాణ ఆర్టీసీ ఇటీవలే కార్గో, పార్సిల్‌ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా రిటైల్‌ ఇంధన అమ్మకాలతో మరో ఆదాయ మార్గంలోకి ప్రవేశించింది. ఆదాయ పెంపులో భాగంగా తెలంగాణ ఆర్టీసీ,హెచ్పీసీఎల్ మరియు ఐఓసీఎల్ సంయుక్త ఆధ్వర్యంలో పెట్రోల్ పంప్ అవుట్‌లెట్ లను నిర్వహించేందుకు నిర్ణయించారు. ఈ మేరకు ఆ కార్యక్రమాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆగస్టు 6, గురువారం నాడు హైదరాబాద్ లోని ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో ఆన్‌లైన్‌ ద్వారా ప్రారంభించారు. మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ, తొలి అవుట్‌లెట్ ను జనగామలో ప్రారంభించామని, మరో 5 అవుట్‌లెట్ లను ఆగస్టు 15 నాటికి ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. రిటైల్ ఇంధన అమ్మకాలను టీఎస్‌ఆర్టీసీ నిర్వహించడం వల్ల ప్రతి నెల ఆర్టీసీకి సుమారు రూ.20.65 లక్షల అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చని తెలిపారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + seventeen =