ప్రధానమంత్రి స్వనిధి పథకం అమలులో అగ్ర స్థానంలో నిలిచిన తెలంగాణ

Mango News Telugu, Modi Video Conference with the Chief Secretaries of All States, Narendra Modi, Narendra Modi holds PRAGATI video conference, PM Modi Today held a PRAGATI Video Conference, PM Narendra Modi holds a video conference, PRAGATI Video Conference, Prime Minister, Prime Minister Narendra Modi

ప్రధానమంత్రి స్వనిధి (ప్రైమ్ మినిస్టర్ స్ట్రీట్ వెండార్స్ ఆత్మనిర్భర్ నిధి) పథకం అమలులో అగ్ర స్థానంలో నిలిచినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశంసలు లభించాయి. తెలంగాణ రాష్ట్రంలో వీధి వ్యాపారుల గుర్తింపు, బ్యాంకు రుణాల మంజూరు మరియు పంపిణీ లో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచిందని కేంద్ర పట్టణాభివృద్ధి మరియు గృహనిర్మాణ శాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలిపారు. ప్రధాని మోదీ బుధవారం నాడు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో గ్రామీణ గృహనిర్మాణం, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, పీఎం స్వనిధి, పలు మౌళిక వసతుల ప్రాజెక్ట్ లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

తెలంగాణ రాష్ట్రంలో 5,88,099 వీధి వ్యాపారులను గుర్తించి ఇందులో 72 శాతం అనగా 4,29,250 రుణ దరఖాస్తులను అప్ లోడ్ చేయడమైనది. రాష్ట్రంలో 3,07,279 మంది వీధి ప్యాపారులకు రుణాలను మంజూరు చేసి 1,76,628 రుణాలను పంపిణీ చేయడమైనది. వీధి ప్యాపారులకు సంబంధించి సర్వే చేయడం కోసం మోబైల్ అప్లికేషన్ ను అభివృద్ధి చేయడమైనది. మూడు నెలలలో సర్వేను పూర్తి చేయడం జరుగుతుంది. వేగవంతమైన సర్వే ద్వారా రాష్ట్రంలో వీధి వ్యాపారులలో 602.91 శాతం పెరుగుదల సాద్యమైనది. వీధి వ్యాపారులకు యూపీఐ ఐడి ల జనరేషన్, క్యూఆర్ కోడ్ జారీ కోసం డిజిటల్ పేమెంట్ అగ్రిగేటర్ లైన ఫోన్ పే, భారత్ పే, పేటియం, ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకు, పే స్విఫ్ ద్వారా ప్రభుత్వం టై అప్ చేసుకుంది.

ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ , మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ , ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు, ఐ.టి. శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ , వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కార్మిక శాఖ కార్యదర్శి అహ్మద్ నదీమ్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ కమీషనర్ రఘునందన్ రావు, పౌరసరఫరాల శాఖ కమీషనర్ అనిల్ కుమార్ మరియు సత్యనారాయణ, సి.డి.యం.ఎ లు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + 10 =