వైఎస్సార్ బిడ్డ అయితే ఏంటి?.. అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

who is sharmila saya asaduddin,who is sharmila,asaduddin,ys sharmila, ysrtp, mim, telangana assembly elections, telangana politics,YSRTP Cheief YS Sharmila,Mango News,Mango News Telugu,Telangana Election Latest Updates,Telangana Latest News And Updates, Telangana Political News And Updates,ys sharmila Latest News,Asaduddins Latest News,Asaduddins Latest Updates
ys sharmila, ysrtp, mim, telangana assembly elections, telangana politics

కొద్దిరోజుల క్రితం వైఎస్ షర్మిల కేటీఆరా?.. ఆయనెవరు? అంటూ పంచ్‌లు వేసిన విషయం తెలిసిందే. సేమ్ టూ సేమ్ ఇటువంటి పంచ్‌ ఇప్పుడు ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ వేశారు. షర్మిల ఎవరో నాకు తెలియదు.. ఆమె ఏమైనా తోపా.. వైఎస్సార్ బిడ్డయితే ఏంటి? అంటూ వ్యాఖ్యానించారు. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన వెన్నంటే ఉన్న అసదుద్దీన్.. ఇప్పుడు షర్మిల తెలియదంటూ వ్యాఖ్యానించడం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

ముందు నుంచి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే దిశగా షర్మిల అడుగులు వేశారు. ఆమె పాలేరు నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఉన్నట్టుండి ఒక్కసారిగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని షర్మిల ప్రకటించారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్ధతుగా ఉంటామని వెల్లడించారు. బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు చీలకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వైఎస్ షర్మిల చెప్పుకొచ్చారు.

అయితే షర్మిల కాంగ్రెస్‌కు మద్ధతిస్తామని ప్రకటించినప్పటి నుంచి.. బీఆర్ఎస్ నేతలు భగ్గుమంటున్నారు. తెలంగాణ వ్యతిరేకులు అంతా ఒక్కటవుతున్నారని మండిపడుతున్నారు. వారందరికి తగిన బుద్ధి చెప్పి తీరుతామని చెబుతున్నారు. దీనిపైనే అసదుద్దీన్ ఓవైసీ కూడా స్పందిస్తూ.. షర్మిలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల ఎవరో తనకు తెలియదని.. ఆమె ఎందుకు ఎన్నికల్లో పోటీ చేయడం లేదో అసలే తెలియదని వ్యాఖ్యానించారు. వైఎస్ రాజేశేఖర్ రెడ్డి బిడ్డ అయితే ఏమైనా తోపా అంటూ అసదుద్దీన్ చెప్పుకొచ్చారు. తెలంగాణ వ్యతిరేక శక్తులు ఎన్ని కుట్రలు పన్నినా.. బీఆర్ఎస్ గెలుపును అడ్డుకోలేరని చెప్పారు.

ఎంఐఎం మద్ధతు బీఆర్ఎస్‌కే ఉంటుందని అసదుద్దీన్ స్పష్టం చేశారు. కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుందన్న ఓవైసీ.. ఆ ప్రయత్నాలన్నీ ఫెయిలవుతాయన్నారు. కాంగ్రెస్ నేతల కలలన్నీ.. కలలుగానే మిగిలిపోతాయని చెప్పుకొచ్చారు. ఆ పార్టీలోని నేతలు కూడా సీఎం కుర్చీ కోసం.. జట్టు పట్టుకొని కొట్టుకుంటారని అసదుద్దీన్ ఓవైసీ ఎద్దేవా చేశారు.

అటు బీసీని సీఎం చేస్తామని అంటున్న బీజేపీ.. అదే సామాజకి వర్గానికి చెందిన బండి సంజయ్‌ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఎందుకు తొలగించిందని ప్రశ్నించారు. అటు కిషన్ రెడ్డికి పోటీ చేస్తే ఓడిపోతామని ముందే తెలుసన్నారు. అందుకే అంబర్‌పేట నుంచి పోటీ చేయకుండా పారిపోయారని విమర్శించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 4 =