సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు రద్దు.. గెజిట్ విడుదల చేసిన కేంద్ర రక్షణ శాఖ

Ministry of Defence Released The Gazette Regarding Secunderabad Cantonment Board Polls Cancellation,Ministry of Defence Released The Gazette,Secunderabad Cantonment Board,Secunderabad Cantonment Board Polls Cancelled,Mango News,Mango News Telugu,Cantonment Board Elections,Secunderabad Cantonment Board Polls News and Updates,Elections 2023,Ministry of Defence Latest News,Secunderabad Cantonment Board Live News,Ministry of Defence Live Updates,Telangana News,Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు రద్దయ్యాయి. ఈ మేరకు ఎన్నికలను రద్దు చేస్తూ కేంద్ర రక్షణ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 17న విడుదల చేసిన గెజిట్‌ను కేంద్రానికి ఉన్న ప్రత్యేక అధికారాలతో రద్దు చేస్తున్నట్లు రక్షణ శాఖ రద్దు ప్రకటించింది. కాగా దేశంలోని మొత్తం 57 కంటోన్మెంట్ బోర్డులకు కేంద్రం ఎన్నికల నిర్వహణకు గాను నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అయితే కంటోన్మెంట్ బోర్డుకు ఏప్రిల్ 30న ఎన్నికలు నిర్వహించాలని రక్షణ శాఖ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వెలువరించింది. ఇక ఈ నేపథ్యంలో నామినేటెడ్ సభ్యులు పలువురు ఎన్నికలను 6 నెలల పాటు వాయిదా వేయాలని కేంద్రాన్ని కోరారు.

కాగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో మొత్తం ఎనిమిది వార్డులున్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు చివరిసారిగా 2015లో ఎన్నికలు జరిగాయి. 2020 ఫిబ్రవరిలో కంటోన్మెంట్ బోర్డు పాలకవర్గం గడువు ముగిసింది. దీంతో కేంద్రం నామినేటేడ్ సభ్యుడిని నియమించింది. ఇదిలా ఉండగా మరోవైపు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాను జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో.. కేంద్ర ప్రభుత్వం ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్‌ జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ కంటోన్మెంట్ వికాస్ మంచ్ అనే స్వచ్చంద సంస్థ ప్రతినిధులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై హైకోర్టులో ఈ నెల 23న విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం ముందుగానే ఎన్నికలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 5 =