వీఎస్టీ-ఇందిరా పార్క్ స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి కేటీఆర్

Minister KTR Makes Surprise Inspection On Vst-Indira Park Steel Bridge Construction Works,Minister KTR Makes Surprise Inspection,Vst-Indira Park Steel Bridge,Vst-Indira Park Construction Works,Minister KTR On Vst-Indira Park,Mango News,Mango News Telugu,Minister KTR Exhorts Ghmc Officials,KTR Inspects Steel Bridge,KTR Asks GHMC Officials, KTR Latest News And Updates,KTR Live News,Telangana News

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం సెంట్రల్ హైదరాబాద్ లోని వీఎస్టీ-ఇందిరా పార్క్ వరకు నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులతో పాటు ఇతర పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీ సందర్భంగా స్టీల్ బ్రిడ్జ్ పనుల పురోగతిని జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ సిబ్బందిని మంత్రి కేటీఆర్ అడిగి తెలుసుకుని, అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. స్టీల్ బ్రిడ్జ్ పనులు తుదిదశకు చేరుకుంటున్న నేపథ్యంలో మూడు నెలలలోగా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశాలు ఇచ్చారు. అందుకు అవసరమైన ట్రాఫిక్ మళ్లింపుపై నగర ట్రాఫిక్ పోలీస్ విభాగంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులను మూడు నెలల్లోగా పూర్తి చేసేందుకు అవసరమైతే అదనపు బృందాలను ఏర్పాటు చేసి, నిర్మాణ పనులను వేగవంతం చేయాలని వర్కింగ్ ఏజెన్సీని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. నిర్మాణ పనుల సందర్భంగా కార్మికులకు, నగర పౌరులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా కట్టుదిట్టమైన రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. మరోవైపు అశోక్ నగర్ వద్ద స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రాం (ఎస్ఎన్డీపీ)లో భాగంగా కొనసాగుతున్న రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను కూడా మంత్రి కేటీఆర్ పరిశీలించారు. అలాగే హుస్సేన్ సాగర్ సర్ప్లస్ నాలాలో చేపడుతున్న పనులను సమీక్షించారు. వర్షాకాలం ప్రారంభం నాటికి ఈ పనులన్నీ పూర్తి అయ్యేవిధంగా చూడాలని, స్థానిక ఎమ్మెల్యే, ఇతర ప్రజా ప్రతినిధుల సహకారంతో వేగంగా ముందుకు పోవాలని జీహెచ్ఎంసీ అధికారులకు ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + nineteen =