మునుగోడులో దూకుడుగా టీఆర్ఎస్, పలు గ్రామాల్లో మంత్రుల ప్రచారం

Munugode Bypoll TRS Ministers Errabelli Talasani and Srinivas Goud Participates Campaigning in Several Villages, TRS Ministers Munugode Campaigning, Errabelli Dayakar Rao Munugode Bypoll Campaigning, Talasani Srinivas Yadav Campaigning, Srinivas Goud Participates Campaigning, Mango News, Mango News Telugu, Munugode Bypoll Elections, Munugode Bypoll, CM KCR News And Live Updates, Telangna Congress Party, Telangna BJP Party, YSRTP , Munugode By Polls, Munugode Election Schedule Release, Munugode Election, Munugode Election Latest News And Updates, Munugode By-poll, BRS Party, Prajashanti Party

తెలంగాణ రాజకీయం ఇప్పుడు మునుగోడు చుట్టూ తిరుగుతోంది. ఉపఎన్నిక దృష్ట్యా అన్ని ప్రధాన పార్టీలు ప్రచారం ఉధృతం చేశాయి. ఈ క్రమంలో అధికార టీఆర్ఎస్‌ మునుగోడులో దూకుడుగా వెళ్తోంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పలువురు మంత్రులు మండలాల వారీగా పర్యటిస్తున్నారు. దీనిలో భాగంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చండూరు లోని 2వ, 3వ వార్డుల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామాల్లోని ప్రజలను కలుస్తూ టీఆర్ఎస్‌కి ఓటు వేయాల్సిందిగా కోరుతున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్యాకేజీల కోసం బీజేపీలో చేరారని, ఇప్పటివరకు తెలంగాణ రాష్టానికి బీజేపీ ఏమి చేసిందో ఆయన చెప్పాలని అన్నారు. మిషన్ భగీరథ పథకంలో నల్గొండ జిల్లాలోనే అత్యధికంగా ఖర్చు చేసింది మునుగోడులోనేనని, తెలంగాణ పథకాలు దేశమంతా అమలు చేస్తామని బీజేపీ ప్రకటిస్తే, మునుగోడు బరినుంచి తప్పుకుంటామని ఎర్రబెల్లి ప్రకటించారు.

తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాద‌వ్ మునుగోడు నియోజ‌క‌వ‌ర్గం నాంప‌ల్లి మండ‌ల కేంద్రంలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ కార్య‌కర్త‌ల స‌మావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేపట్టిన మిషన్ భగీరథ ద్వారా మునుగోడులోని ఫ్లోరైడ్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించామని తెలిపారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎమ్మెల్యేగా గెలిచిన 4 సంవ‌త్స‌రాల త‌ర్వాత నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి గుర్తు వ‌చ్చిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని అమలుచేస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్ర‌భుత్వానిదేనని, అందుకే ఆ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాల‌ని తలసాని శ్రీనివాస్ యాద‌వ్ కోరారు.

ఇక రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్‌ మున్సిపాలిటీ పరిధి తాళ్లసింగారం గ్రామంలో ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసిన ఆయన నిత్యావసర వస్తువుల ధరలను ఇష్టానుసారంగా పెంచుతున్న బీజేపీ ప్రభుత్వానికి మునుగోడు ఓటర్లు బుద్ధి చెప్పాలని ఆయన కోరారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు రాష్ట్రవ్యాప్తంగా వృద్ధులకు, దివ్యాంగులకు, వితంతువులకు ప్రతినెలా పింఛన్ అందుతోందని తెలిపారు. ఈ పరిపాలన ఇలాగె కొనసాగాలంటే టీఆర్ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డికి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven + twenty =