మహారాష్ట్రలో ఉద్ధవ్​ థాకరే, ఏక్​నాథ్ షిండే వర్గాలకు కొత్తపేర్లు, కొత్త గుర్తులు కేటాయింపు

Election Commission Allotted Party names and Symbols to Shiv Sena Factions of Uddhav Thackeray and CM Eknath Shinde, EC Allotted Party Names to Shiv Sena Factions, EC Allotted Symbols to Shiv Sena Factions, EC Shiv Sena Party Uddhav Thackeray Symbols, Shiv Sena CM Eknath Shinde, Mango News, Mango News Telugu, Shiv Sena Party Allotted names, Shiv Sena Party Allotted Symbol, Election Commission Shiv Sena Factions, Election Commission Of India, Election Commission New Symbols to Shiv Sena Factions, ECI Latest NewsAnd Live Updates, Shiv Sena News And Updates

మహారాష్ట్రలోని శివసేన పార్టీలో చీలికలు వచ్చిన విషయం తెలిసిందే. ఉద్ధవ్ థాకరే నేతృత్వంలో ఓ వర్గం ఉండగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్​నాథ్ షిండే నేతృత్వంలో మరోవర్గం ఉంది. ఈ క్రమంలో శివసేన పార్టీ పేరును, ఆ పార్టీ గుర్తు విల్లుబాణం (విల్లంబు)ను ఏ వర్గానికి కేటాయించకుండా స్తంభింపజేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) నిర్ణయం తీసుకుంది. అయితే త్వరలో అంధేరీ ఈస్ట్ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఆయా వర్గాల నుంచి గ్రూప్/పార్టీ పేరు, గుర్తుల కోసం ఈసీ ఆప్షన్స్ స్వీకరించి తుది నిర్ణయం తీసుకుంది.

ఉద్ధవ్ థాకరే వర్గానికి సంబంధించి పార్టీ పేరును ‘శివసేన ఉద్ధవ్‌ బాలాసాహెబ్‌ థాకరే’ గా ఉండేందుకు ఈసీ అనుమతి తెలిపింది. అలాగే ఉద్ధవ్ వర్గం త్రిశూలం, ఉదయిస్తున్న సూర్యుడు(రైజింగ్ సన్), ఫ్లేమింగ్ టార్చ్(కాగడా) గుర్తుల్లో ఒకదాన్ని కేటాయించాలని కోరగా, అన్ని అంశాలను పరిశీలించి కాగడా గుర్తుకు ఈసీ అనుమతి ఇచ్చింది. ఇక సీఎం ఏక్​నాథ్ షిండే వర్గానికి సంబంధించి “బాలాసాహెబంచి శివసేన” అనే పేరును ఈసీ ఖరారు చేసింది. ఇక పార్టీ గుర్తుకై సన్/సూర్య/సూరజ్ లేదా ధాల్ తల్వార్ (జోడు కత్తులు-డాలు) గుర్తులు కావాలని ఏక్​నాథ్ షిండే వర్గం ఈసీకి ప్రతిపాదనలు పంపగా ‘జోడు కత్తులు-డాలు’ గుర్తును కేటాయిస్తూ ఈసీ తుది నిర్ణయం తీసుకుంది. అంధేరీ ఈస్ట్ ఉపఎన్నికలో శివసేనకు చెందిన ఇరు వర్గాలు కూడా కొత్త పార్టీ పేర్లు, గుర్తులతోనే బరిలోకి దిగనున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + eighteen =