కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు: రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్, చమురు సంస్థలకు రూ.22000 కోట్లు మంజూరు

Union Cabinet Decisions Approves Rs 22000 Cr to Oil Marketing Companies 78 Days Bonus to Railway Employees for 2021-22, Union Cabinet Decisions, Union Cabinet Approves Rs 22000 Cr to Oil Marketing Companies, 78 Days Bonus to Railway Employees for 2021-22, Mango News, Mango News Telugu, Union Cabinet Oil Marketing Companies, Union Cabinet 78 Days Bonus to Railway Employees, Union Cabinet Latest News And Updates, Union Cabinet Oil Marketing, Cabinet Clears Rs 22K Cr Grant For Oil Psus, Rs 1832 Cr Bonus For Rail Staff, 7th Pay Commission, Centre Approves 78 Days Wage To Railway Employess

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం నాడు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను కేంద్ర ప్రసార, సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు.

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు:

  • 2021-22 ఆర్థిక సంవత్సరానికి రైల్వే ఉద్యోగులకు ఉత్పాదకత లింక్డ్ బోనస్ (పీఎల్బీ) చెల్లింపునకు కేంద్ర కేబినెట్ ఎక్స్-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం తెలిపింది. అర్హులైన రైల్వే ఉద్యోగులకు పీఎల్బీ చెల్లింపు ప్రతి సంవత్సరం దసరా/పూజ సెలవులకు ముందు చేయబడుతుంది. ఈ ఏడాది కూడా దాదాపు 11.27 లక్షల మంది నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సమానమైన పీఎల్‌బీ మొత్తాన్ని చెల్లించారు. అర్హులైన రైల్వే ఉద్యోగికి చెల్లించాల్సిన గరిష్ట మొత్తం 78 రోజులకు రూ.17,951. ట్రాక్ మెయింటెయినర్లు, డ్రైవర్లు, గార్డ్‌లు, స్టేషన్ మాస్టర్లు, సూపర్‌వైజర్లు, టెక్నీషియన్, టెక్నీషియన్ హెల్పర్, కంట్రోలర్, పాయింట్స్‌మెన్, మినిస్టీరియల్ స్టాఫ్ మరియు ఇతర గ్రూప్ ‘సి’ సిబ్బంది వంటి వివిధ వర్గాలకు రూ.17,951 చెల్లించబడింది.
  • మూడు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలకు రూ.22,000 కోట్లను ఒకేసారి మంజూరు చేయాలన్న కేంద్ర పెట్రోలియం అండ్ సహజ వాయువు మంత్రిత్వ శాఖ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) మరియు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెఛ్పీసీఎల్) మధ్య ఈ గ్రాంట్ పంపిణీ చేయబడనుంది. జూన్ 2020 నుండి జూన్ 2022 వరకు ఎల్పీజీ అంతర్జాతీయ ధరలు దాదాపు 300% పెరిగాయని, అయినప్పటికీ దేశంలో ఆ భారం వినియోగదారులపై పడనీయలేదన్నారు. ఈ కాలంలో దేశీయ ఎల్పీజీ ధరలు 72% మాత్రమే పెరిగాయని, దీంతో చమురు మార్కెటింగ్ కంపెనీలకు గణనీయమైన నష్టాలకు గురయ్యాయని, ఆ నష్టాన్ని పూడ్చేందుకు రూ.22,000 కోట్లను మంజూరు చేస్తునట్టు తెలిపారు.
  • 2022-23 నుండి 2025-26 వరకు 15వ ఫైనాన్స్ కమిషన్‌లో మిగిలిన నాలుగు సంవత్సరాలకు ‘ప్రైమ్ మినిస్టర్స్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఫర్ నార్త్ ఈస్ట్ రీజియన్’ అనే కొత్త పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
  • మల్టీ-స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్, 2002ని సవరించేలా మల్టీ-స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ (సవరణ) బిల్లు, 2022కి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 2 =