తెలంగాణలో మరో ఎంపీ, ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్

Coronavirus, Coronavirus Breaking News, Coronavirus Latest News, COVID-19, MLA Marri Janardhan Reddy Tests Positive, MLA Marri Janardhan Reddy Tests Positive for Covid-19, MP Pothuganti Ramulu Tests Positive, Nagarkurnool MP Pothuganti Ramulu, telangana, Telangana Coronavirus

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పలువురు ప్రజా ప్రజానిధులు కరోనా వైరస్ బారినపడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా నాగర్ కర్నూల్ ఎంపీ, ఎమ్మెల్యే కి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి కరోనా బారినపడ్డ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. “గత రెండు రోజులుగా స్వల్ప అనారోగ్యంతో బాధపడుతూ, కరోనా పరీక్షలు చేయించుకోగా వైద్యులు కరోనాగా నిర్ధారించారు. ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు హోమ్ క్వారంటైన్ లో వున్నాను. ఈ కాలంలో తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని, వైద్యపరంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను” అని మర్రి జనార్థన్ రెడ్డి ట్వీట్ చేశారు.

అలాగే నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు కూడా తనకు కరోనా‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని శుక్ర‌వారం నాడు వెల్ల‌డించారు. ప్రస్తుతం త‌న ఆరోగ్యం బాగానే ఉంద‌ని, వైద్యులు సూచన మేరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతునట్టు ఎంపీ వెల్లడించారు. గత వారం రోజులుగా త‌న‌ను క‌లిసిన ‌వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాల‌ని, ఇతరులతో వేరుగా ఉండి నిబంధనలు పాటించాలని ఎంపీ రాములు కోరారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్ 23 నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,30,274 కి చేరుకోగా, 2,09,034 మంది ఇప్పటికే సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − 5 =