డబ్బైపైనే.. ఎవరి ధీమా వారిది!

Over twenty Who cares about them,Over twenty Who cares,Who cares about them,brs, congress, kcr, ktr, revanth reddy, telangana assembly elections,Mango News,Mango News Telugu,Telangana Polling,Telangana Assembly Election Results,Telangana Exit polls,Telangana Election Result 2023,Telangana Assembly Election Results LIVE 2023,Telangana Election Results,BRS Polls News Today,Congress Polls Latest Updates
brs, congress, kcr, ktr, revanth reddy, telangana assembly elections

ముందు నుంచీ చెబుతున్నంత కాంగ్రెస్ గాలి పోలింగ్‌ వరకు వచ్చేసరికి తగ్గింది. ఎగ్జిట్‌ పోల్స్‌ ద్వారా ఆ విషయం స్పష్టం అవుతోంది. మెజారిటీ సర్వే సంస్థలు కాంగ్రెస్‌కే జై కొట్టినప్పటికీ.. దేంట్లో చూసినా ఐదు నుంచి పది లోపు స్థానాలు మాత్రమే తేడా కనిపిస్తోంది. అంటే.. బీఆర్‌ఎస్‌ కూడా విజయానికి మరీ అంతదూరం ఏం లేదు. మ్యాజిక్‌ ఫిగర్‌ 60 స్థానాలు కావడంతో కొంచెం అటు.. ఇటు అయినా బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ చక్రం తిప్పగలరు. ఇదిలాఉండగా.. పోలింగ్‌ ముగిసిన అనంతరం ఇరు పార్టీల నుంచి కీలక నేతలు మీడియా ముందుకు వచ్చి సీట్ల విషయంలో ఒకటే అంకె పలకడం ఆసక్తిగా మారింది.

ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు వచ్చిన అనంతరం బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు మీడియా ముందుకు వచ్చారు. సర్వే సంస్థలపై అసహనం వ్యక్తం చేశారు. 70కి పైగా సీట్లతో మరోసారి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. 80కి పైగా సీట్లతో గెలుస్తాం అనుకున్నాం కానీ..  ప్రస్తుతం 70కి పైగా సీట్లతో గెలుస్తామని  తెలిపారు. చెప్పడం గమనార్హం. రాష్ట్రం ఏర్పడడానికి ముందు తెలంగాణ ఎట్లుంది? పదేళ్ల తర్వాత ఎట్లయిందన్న ప్రచారంతోనే ఎన్నికలకు వెళ్లిన బీఆర్‌ఎస్‌ నేతలు.. అది బాగా పనిచేసిందని చెబుతున్నారు. పట్టణ, గ్రామీణ నియోజకవర్గాల్లో పార్టీకి సైలెంట్‌ ఓటింగ్‌ జరిగిందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి సైలెంట్‌ ఓటింగ్‌ జరిగింది కాబట్టే ఎగ్జిట్‌ పోల్స్‌లో ప్రతిఫలించట్లేదని చెబుతున్నారు.

వాస్తవానికి పోలింగ్‌ తర్వాత వెలువడిన ఎగ్జిట్‌ పోల్‌ ఒపీనియన్‌లో మెజారిటీ సంస్థలు.. కాంగ్రెస్‌ పార్టీనే అధికారంలోకి వస్తుందని తేల్చాయి. అయితే 2018లోనూ మెజారిటీ ఎగ్జిట్‌ పోల్స్‌ బీఆర్‌ఎస్‌ ఓటమిపాలు కానున్నట్లుగా తేల్చాయని, అవి తప్పని ఫలితాలు తేల్చాయని కేటీఆర్‌ అన్నారు. ఉద్యోగులు, నిరుద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి, పేపర్‌ లీకేజీ, రుణమాఫీ, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు.. తదితర హామీలు పూర్తిస్థాయిలో అమలు కాకపోవడం, కొత్త ఓటర్లకు సహజంగా మార్పును కోరుకునే తత్వం ఉండడం వంటివి తమ అంచనాలను తలకిందులు చేస్తాయోమోనన్న ఆందోళనా పలువురు నేతల్లో నెలకొని ఉందంటున్నారు.

ఇదిలా ఉంటే.. తాము కూడా 70కి పైగా సీట్లు సాధించి పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనకు చరమగీతం పాడతామని కాంగ్రెస్‌ నేతలు చెప్పారు. బీఆర్‌ఎస్‌కు25కు మించి సీట్లు రాబోవని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. గురువారం రాత్రి నుంచే సంబరాలు చేయాలంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పోలింగ్‌ సరళిని బట్టి రాష్ట్రంలో పదికి పైగా స్థానాల్లో గెలుస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. హంగ్‌ పరిస్థితులు వస్తే కింగ్‌ మేకర్లం అవుతామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరోవైపు 7-9 సీట్లు గెలుస్తామని చెబుతున్న మజ్లిస్‌ పార్టీ కూడా.. హంగ్‌ వస్తే కింగ్‌ మేకర్‌ అవుదామన్న ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − thirteen =