ఈసారి కాస్త భిన్నమే..!

This Time Its a Bit Different,Its a Bit Different,kcr, ktr, revanth reddy, kishan reddy, telangana assembly elections,Mango News,Mango News Telugu,Telangana Elections 2023,Telangana Assembly Elections 2023,,Telangana Assembly Election Results 2023,Telangana Election Result 2023,Telangana Assembly Election Results LIVE 2023,Telangana Election Results, Telangana Assembly Election Results,Telangana Polling Latest Updates,Telangana Polling Latest News
kcr, ktr, revanth reddy, kishan reddy, telangana assembly elections

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమరం ముగిసింది. సుమారు నెల రోజుల ముందు నుంచే ప్రధాన పార్టీల నేతలు రాష్ట్రానికి కదలివచ్చారు. అన్ని ప్రాంతాల్లోనూ కలియతిరిగి అభ్య‌ర్థుల గెలుపు కోసం చెమ‌టోడ్చారు. బీఆర్‌‌ఎస్‌ నుంచి అయితే అంతకన్నా ముందు నుంచే ప్రచారంలో పాల్గొన్నారు. ఇక తానే గెలవాలన్న తాపత్రయంతో పోలింగ్‌ ముగిసే వరకు కూడా అభ్యర్థులందరూ ప్రయత్నాలు చేశారు. మొత్తానికి నిన్నటితో 2023 ఎన్నికలు ముగిశాయి. ఫలితాల కోసం ఇంకో రెండు రోజులు వేచి చూడాలి.

అస‌లు విష‌యానికి వ‌స్తే.. సాధారణంగా ఎన్నికలు జరిగిన ప్రతిసారీ పోలింగ్‌ రోజు సాయంత్రం ఓ రకమైన వాతావరణం కనిపించేది. ఒక పార్టీకి ఎక్కువ ఓట్లు పడిన‌ట్లు అనిపిస్తే.. ఆ పార్టీ కార్యకర్తలు ఆ రోజు సాయంత్రమే సందడి చేసేవారు. పోలింగ్‌ స్టేషన్‌ సమీపంలో టేబుల్స్‌ వేసుకొని కూర్చున్న వారిలో ముఖాల్లో సంతోషం వ్యక్తమయ్యేది. ఈసారి అలాంటి పరిస్థితులు కనిపించ లేదు. పోలింగ్‌ ఏజెంట్లు కూడా పరిస్థితిని అంచనా వేయలేకపోయారు. మెజారిటీ ఎగ్జిట్‌పోల్స్‌ కాంగ్రెస్‌ అని ప్రకటించినా.. ఆ పార్టీలో కూడా సందిగ్ధమే ఏర్పడింది. ఎక్కడా కార్యకర్తల హడావిడి లేదు.

చివరకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మీడియా ముందుకు వచ్చి.. కార్యకర్తలు ఇప్పటి నుంచే సంబరాలు ప్రారంభించవచ్చునని, 70 సీట్లకుపైగా సాధించి మనమే అధికారంలోకి వస్తామని ప్రకటించారు. అయినప్పటికీ.. ఎక్కడా కాంగ్రెస్ లో సందడి లేదు. ఎగ్జిట్‌పోల్స్‌ నేపథ్యంలో బీఆర్‌ ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు మీడియాతో మాట్లాడుతూ.. అవన్నీ తూచ్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ సాధిస్తుందని చెప్పారు. అయినా.. ఆ పార్టీ కార్యకర్తల్లో కూడా పూర్తి స్థాయిలో భరోసా ఏర్పడలేదు. ఓటింగ్‌ సరళిని బట్టి.. విజయావకాశాలపై అంచనా వేయలేక అభ్యర్థులు కూడా ఒత్తిడికి గురవుతున్నారు. బస్తీలు, కాలనీల వారీగా జరిగిన ఓటింగ్‌ సరళిని పరిశీలించుకుంటూ కొంతమంది గెలుస్తామా, లేదోననే టెన్షన్‌తో సతమతం అవుతున్నారు. వారికి ఈ నెల 3 వరకు ఆ హైరానా తప్పదు.

చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసినప్పటికీ.. ఓటరు నాడి అంచనా వేయలేక, అభ్యర్థులు, పార్టీ కార్యకర్తలు గందరగోళంలో పడ్డారు. ఎగ్జిట్‌పోల్స్‌ తర్వాత కూడా ఏ పార్టీలోనూ అంతగా ఆనందం కానీ, ఓడిపోతామన్న బాధ కానీ కనిపించలేదు. మొత్తంగా పోలింగ్‌ రోజున పరిస్థితి గమనిస్తే కాస్త భిన్నంగా, బాగా గుంభనంగా ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 1 =