చంద్రబాబు చెప్పినా విననంటోన్న క్యాడర్

TDP cadre vote in Telangana for that party,TDP cadre vote in Telangana,TDP cadre vote in Telangana,Telangana for that party,Mango News,Mango News Telugu,Telugu Desam Party Bows Out,Who will gain from TDPs absence,TDPs decision to contest polls,TDP cadre vote Latest News,TDP cadre vote Latest Updates,Telangana Assembly election,TDP cadre, vote in Telangana, for that party, Chandrababu, TDP cadre,vote in Telangana Latest News,vote in Telangana Latest Updates,TDP cadre Latest News
TDP cadre, vote in Telangana, for that party?, Chandrababu, TDP cadre

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. తెలంగాణ ఏర్పడిన తరువాత కూడా టీడీపీని ఆరాధిస్తున్న ఓటర్లు ఇంకా ఉన్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాల్లో టీడీపీ అభిమానులు ఉన్నారు. అయితే రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ పరిస్థితులను బట్టి వారు ఇతర పార్టీలకు మారుతూ వస్తున్నారు. కొన్ని రోజుల క్రితం తెలంగాణాలో తెలుగుదేశం పోటీ చేయడం లేదని ప్రకటించాక ఇప్పుడు వీరి పరిస్థితి మళ్లీ ఏదో ఒక రాజకీయ పార్టీని ఆశ్రయించాల్సి వస్తోంది. అయితే చంద్రబాబు తెలంగాణాలో టీడీపీ క్యాడర్ అంతా బీజేపీకి మద్దతు ఇవ్వాలని కోరినట్టు సమాచారం. ఇక్కడి టీడీపీ క్యాడర్ మాత్రం అందుకు సిద్ధంగా లేదని తెలుస్తోంది. వారంతా కాంగ్రెస్ కు సపోర్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

తెలంగాణాలో ఉన్న బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు ఏపీ విషయానికి వచ్చేసరికి జగన్ నే సపోర్ట్ చేస్తున్నారని, అందుకే తాము తెలంగాణ బీజేపీకి ఓట్లు వేయమని ఇక్కడి టీడీపీ నాయకులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో చంద్రబాబు ఆదేశించినా టీడీపీ నాయకులు, కార్యకర్తలు వినే పరిస్థితిలో లేరు. ఏపీలో టీడీపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న బీజీపీకి జై కొట్టేది లేదని తేల్చి చెప్పేస్తున్నారట. ఇప్పటికే కొన్ని సర్వేలు తెలంగాణాలో కాంగ్రెస్ కు విజయం దక్కే అవకాశం ఉందని చెబుతున్నాయి. ఇక టీడీపీ ఓట్లు కూడా కాంగ్రెస్ కే పడితే వారి విజయం మరింత సునాయాసం కావచ్చు.

ఇప్పటికే తెలంగాణాలో టీడీపీకి అండగా ఉన్న కమ్మ సామాజిక వర్గం కాంగ్రెస్ వైపు ఉండాలని నిర్ణయించుకుంది. కమ్మ నేతలైన తుమ్మల నాగేశ్వర రావు, మండవ వెంకటేశ్వర రావు కాంగ్రెస్ లో ఇప్పటికే చేరారు. గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మధ్య సాన్నిహిత్యం అధికంగానే ఉండేది. తరువాత ఆ స్నేహానికి బీటలు వారినా, మళ్లీ చిగురించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు అరెస్టు అయినప్పుడు తెలంగాణా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది.

మరో పక్క టీడీపీ ఓట్ల కోసం బీఆర్ఎస్ కూడా తీవ్రంగానే కష్టపడుతోంది. ఇప్పటికే కాసాని జ్ఞానేశ్వర్ టీడీపీకి రాజీనామా చేశాడు. అతడిని తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా టీడీపీ ఓట్లు కొన్నయినా కొల్లగొట్టాలని బీఆర్ఎస్ ప్లాన్. కాసాని కొన్ని రోజుల క్రితమే బీఆర్ఎస్ లో చేరిపోయారు. ఇక బీఆర్ఎస్ కు ఇతని వల్ల ఎంత కలిసొస్తుందో వేచి చూడాలి. మొత్తమ్మీద ప్రభుత్వ వ్యతిరేక ఓటు బలంగా పనిచేస్తేనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × two =