తెలంగాణ నూతన సీఎస్ గా సోమేశ్ కుమార్ నియామకం

Mango News Telugu, New CS Of Telangana State, Political Updates 2020, Somesh Kumar, telangana, Telangana Breaking News, Telangana Political Live Updates, Telangana Political Updates, Telangana Political Updates 2020

తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేశ్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు నూతన సీస్ నియామక దస్త్రంపై తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు డిసెంబర్ 31, మంగళవారం నాడు సంతకం చేశారు. ప్రస్తుతం ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న సోమేశ్‌ కుమార్‌ జనవరి 1,2020 నుంచి సీఎస్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. బీహార్‌కు చెందిన సోమేశ్ కుమార్ 1989 బ్యాచ్‌కు చెందిన అధికారి. తెలుగు రాష్ట్రాల విభజన అనంతరం ఆయన్ను ఆంధ్ర కేడర్‌కు కేటాయించినా, క్యాట్‌ను సంప్రదించి తెలంగాణ రాష్ట్రంలోనే కొనసాగుతున్నారు. 2023 డిసెంబర్‌ 31 వరకు సోమేశ్‌కుమార్‌ తెలంగాణ సీఎస్‌గా కొనసాగనున్నారు. ఆయన గతంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా కూడా విధులు నిర్వహించారు.

ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న శైలేంద్ర కుమార్‌ జోషి పదవీకాలం ఈ రోజు (డిసెంబర్ 31, మంగళవారం)తో ముగిసింది. ఈ సాయంత్రం ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే నూతన సీఎస్ నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పదవి విరమణ అనంతరం ఎస్కె జోషి నీటిపారుదల వ్యవహారాల సలహాదారుడిగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 7 =